Advertisement

  • అమెరికా ఎన్నికలు...భారత సంతతి కోటీశ్వరుడు థానేదర్ కు భారీ మెజారిటీ

అమెరికా ఎన్నికలు...భారత సంతతి కోటీశ్వరుడు థానేదర్ కు భారీ మెజారిటీ

By: Sankar Thu, 05 Nov 2020 12:42 PM

అమెరికా ఎన్నికలు...భారత సంతతి కోటీశ్వరుడు థానేదర్ కు భారీ మెజారిటీ


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన పలువురు విజయం సాధించారు. రో ఖన్నా, ప్రమీలా జయపాల్, రాజా కృష్ణమూర్తి, డాక్టర్ అమీ బేరాలు రెండోసారి ఎన్నికయ్యారు.

ఇక, మిచిగాన్ నుంచి ప్రతినిధుల సభకు డెమొక్రాటిక్ పార్టీ తరఫున భారత సంతతికి చెందిన కోటీశ్వరుడు శ్రీ థానేదర్ భారీ మెజార్టీతో గెలుపొందారు. మొత్తం 93 శాతం ఓట్ల ఆయనకే దక్కడం విశేషం. రెండేళ్ల కిందట మిచిగన్ గవర్నర్‌ పదవి కోసం థానేదర్ పోటీపడ్డారు. శాస్త్రవేత్త, వ్యాపారవేత్త అయిన థానేదర్ రికార్డు స్థాయిలో 438,620 డాలర్ల విరాళాలను సేకరించారు.

2018లో ఆన్ అర్బోర్ నుంచి డెట్రాయిట్‌కు మారిన తరువాత రెండేళ్ల కిందట ‘శ్రీ ఫర్ వి’ పేరుతో టెలివిజన్‌లో చేసిన ప్రకటనలు ఆయనకు గుర్తింపు తీసుకొచ్చాయి. మూడో డిస్ట్రిక్ట్ ఆఫ్ మిచిగాన్‌ నుంచి శ్రీ విజయం సాధించారు. 2018 గవర్నర్ ఎన్నికల కోసం 10 మిలియన్ డాలర్లు ఖర్చుచేసిన థానేదర్.. మూడో స్థానంలో నిలిచారు. గ్రెట్చెన్ విట్మర్, అబ్దుల్ ఎల్ సయీద్ తర్వాతి స్థానంలో థానేదార్‌ నిలిచినా డెట్రాయిట్‌లో అత్యధిక ఓట్లను గెలుచుకున్నారు.

Tags :

Advertisement