Advertisement

  • రాముడు మా దేశస్తుడే అన్న నేపాల్ ప్రధానిని ఆడుకుంటున్న నెటిజన్లు..

రాముడు మా దేశస్తుడే అన్న నేపాల్ ప్రధానిని ఆడుకుంటున్న నెటిజన్లు..

By: Sankar Tue, 14 July 2020 5:53 PM

రాముడు మా దేశస్తుడే అన్న నేపాల్ ప్రధానిని ఆడుకుంటున్న నెటిజన్లు..



నేపాల్ ప్రధాని కెపి ఓలి శర్మ ..హిందువుల ఆరాధ్య దైవం అయినా శ్రీరామచంద్రుడు భారతదేశం లో పుట్టలేదు అని ..ఆయనది నేపాల్ అని , ఆయన పుట్టిన అయోధ్య ఇండియాలో లేదు అని , నేపాలోనే ఉంది అని ఇలా అనేక వ్యాఖ్యలు చేసాడు ..దీనితో నేపాల్ ప్రధాని వ్యాఖ్యలు మీద భారతీయులు ఒక వైపు విమర్శలు చేస్తూనే మరో వైపు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు ..

అయ్యో.. రాముడేం ఖ‌ర్మ‌, విశ్వంలో ఉన్న అన్ని గ్ర‌హాలు మీవే'నంటూ సెటైర్లు వేస్తున్నారు.ప్ర‌స్తుతమున్న నేపాల్ 2025క‌ల్లా ప్ర‌పంచ దేశాల‌ను ఆక్ర‌మించుకుంటుంది. ఆ త‌ర్వాత 2030 క‌ల్లా అంత‌రిక్షంలోని గ్ర‌హాల‌ను, అనంత‌రం అంత‌రిక్షాన్ని, మొత్తం అనంత విశ్వాన్నే ఆక్ర‌మించుకుంటుంద"‌ని ఓ నెటిజ‌న్ పేర్కొన్నారు.

రానున్న రోజుల్లో నేపాల్ ప్ర‌ధాని ఇలా అంటారు.. న్యూయార్క్ అమెరికాలో లేదు, నేపాల్‌లో ఉంది. అంతెందుకు ఆస్ట్రేలియా కూడా నేపాల్‌దే. టోక్యో, పారిస్ లండ‌న్, బెర్లిన్‌, సూడాన్‌, బ్యాంకాక్‌, లాస్ వెగాస్‌, ఇస్లామాబాద్ అన్నీ నేపాల్‌వే. నేపాల్‌వాసినైనందుకు నాకు గ‌ర్వంగా ఉంది", "ఆయన్ను అలాగే వ‌దిలేస్తే రావ‌ణుడు చైనా, గౌత‌మ్ బుద్ధుడు రష్యా, మ‌హ‌వీర్ నార్త్ పోల్ నుంచి వ‌చ్చాడంటారు" ‌అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. "రాముడు నేపాల్ వాస్త‌వ్యులా.. ఇదెప్పుడు జ‌రిగింది?" అంటూ మీమ్స్‌రాయుళ్లు ఫ‌న్నీ క్యాప్ష‌న్‌లతో చెల‌రేగిపోతున్నారు. కాగా ఓలి.. వాల్మీకి ఆశ్ర‌మం కూడా నేపాల్‌లోనే ఉంద‌ని, ద‌శ‌రథుడు త‌మ దేశాన్ని పాలించేవాడ‌ని, అత‌ని కొడుకు రాముడు కూడా ఇక్క‌డే పుట్టాడ‌ని వాదించ‌గా వాటిని భార‌తీయులు కొట్టిపారేశారు

Tags :
|
|
|
|
|

Advertisement