Advertisement

  • 40 వ వసంతంలోకి అడుగుపెట్టిన దిగ్గజ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్

40 వ వసంతంలోకి అడుగుపెట్టిన దిగ్గజ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్

By: Sankar Fri, 03 July 2020 3:35 PM

40 వ వసంతంలోకి అడుగుపెట్టిన దిగ్గజ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్



భారత దిగ్గజ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ 40 వ వసంతలోకి అడుగుపెట్టాడు ..అనిల్ కుంబ్లే తో కలిసి దాదాపు ఒక దశాబ్దం పైగానే భారత బౌలింగ్ విభాగాన్ని నడిపించిన హర్భజన్ , ఇండియా తరుపున టెస్ట్ క్రికెట్ లో హ్యాట్రిక్ తీసిన తొలి ఆటగాడు ..చారిత్రక ఈడెన్ గార్డెన్స్ టెస్టులో ఈ ఘనతను సాధించాడు ..

1980, జూలై 3న పంజాబ్‌లో జలంధర్‌లో జన్మించిన హర్భజన్ సింగ్.. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన తొలినాళ్లలోనే తన బౌలింగ్ యాక్షన్‌తో విమర్శలు ఎదుర్కొన్నాడు. కానీ.. అందరికీ తన ప్రదర్శనతోనే బదులిచ్చిన భజ్జీ.. 2001లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో ఒంటిచేత్తో టీమిండియాకి విజయాల్ని అందించాడు. మూడు టెస్టుల ఆ సిరీస్‌లో హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టడమే కాకుండా.. ఏకంగా 32 వికెట్లని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత కూడా అనిల్ కుంబ్లేతో కలిసి ఎన్నో మ్యాచ్‌ల్లో భారత్‌‌ విజయాలకి హర్భజన్ బాటలు వేశాడు..

అయితే కెరీర్ లో ఎన్నో ఘనతనలను సొంతం చేసుకున్న హర్భజన్ సింగ్ అదే స్థాయిలో వివాదాలు కూడా ఉన్నాయి ..ఐపీయల్ లో శ్రీశాంత్ ను కొట్టడం , ఆస్ట్రేలియా సిరీస్ లో మంకీ గేట్ వివాదం ప్రముఖంగా చెప్పుకోవాల్సినవి ..యువ ఆటగాళ్ల విజృంభణతో జట్టులో స్థానం కోల్పోయిన హర్భజన్ ప్రస్తుతం ఐపీయల్ లో మాత్రమే ఆడుతున్నాడు ..మొత్తం తన కెరీర్లో 103 టెస్టులు, 236 వన్డేలు, 28 టీ20ల్లో కలిపి మొత్తం 711 వికెట్లు పడగొట్టాడు.

Tags :
|

Advertisement