Advertisement

  • నీ కీర్తి అనితర సాధ్యం ..హ్యాపీ బర్త్ డే మహేంద్ర సింగ్ ధోని ..

నీ కీర్తి అనితర సాధ్యం ..హ్యాపీ బర్త్ డే మహేంద్ర సింగ్ ధోని ..

By: Sankar Tue, 07 July 2020 10:21 AM

నీ కీర్తి అనితర సాధ్యం ..హ్యాపీ బర్త్ డే మహేంద్ర సింగ్ ధోని ..



మహేంద్ర సింగ్ ధోని ..ఒక మాములు మధ్య తరగతి నుంచి వచ్చి ఇండియన్ క్రికెట్ను శాశించిన దిగ్గజ ఆటగాడు ..కుటుంబం కోసం టికెట్ కలెక్టర్ జాబ్ చేసిన ధోని , ఆ తర్వాత దేశంకోసం ప్రపంచకప్ అందించిన వీరుడు ..ఎందరో మధ్య తరగతి ఆటగాళ్లకు ఇన్స్పిరేషన్ ధోని ..కేవలం ముంబై , ఢిల్లీ , లాంటి మెట్రో నగరాల నుంచి వస్తేనే ఇండియన్ టీంలో స్థానం లభిస్తుంది అన్న మాటలు తప్పు అని నిరూపించిన వ్యక్తి ధోని..ఇండియన్ క్రికెట్ టీం ఇప్పటివరకు చుసిన అత్యుత్తమ కీపర్ , అత్యుత్తమ ఫినిషర్ , అత్యుత్తమ కెప్టెన్ , అత్యుత్తమ గేమ్ రీడర్ ఇలా చెప్పుకుంటూ పోతే ధోని సాధించిన ఘనతలు అన్ని ఇన్ని కావు ..

కీపర్ గా తన ప్రస్థానము మొదలు పెట్టి , ఆ తర్వాత పించ్ హిట్టర్ గా , ఆపత్కాల సమయంలో కెప్టెన్సీ బాధ్యతలు అందుకొని కెప్టెన్ గా , యువ ఆటగాళ్లకు మార్గ నిర్దేశం చేస్తూ ఫినిషర్ గా ఇలా ధోని పోషించని పాత్ర అంటూ లేదు ..మ్యాచ్ లో ఇండియా సగం వికెట్లు తక్కువ పరుగులకే కోల్పోయిన అభిమానుల్లో ఎక్కడలేని భరోసా వస్తున్నదంటే దానికి కారణం ధోని ..ఎన్నో మ్యాచ్ లను ఒంటి చేత్తో విజయాలను అందించాడు ..సిక్సర్ తో మ్యాచ్ లను ఫినిష్ చేయడంలో ధోనికి ధోనీనే సాటి ..2007 టి ట్వంటీ ప్రపంచకప్ , 2008 సీబీ సిరీస్ , 2011 వరల్డ్ కప్ , టెస్ట్ల్లో అగ్రస్థానం , 2013 ఛాంపియన్స్ ట్రోఫీ , ఇలా ధోని సాధించండి ఏది లేదు ..ఇక ఐపీయల్ లో అయితే ధోనితో పోటీ పడే కెప్టెన్ ఇంకొకరు లేరు అంటే అతిశయోక్తి కాదు..

ఇక కెరీర్ లో చివరి దశలో ఉన్న ధోని రిటైర్మెంట్ ఎప్పుడు అనేది చెప్పకుండా అభిమానులను సందిగ్ధంలో పడేసాడు ..చివరి సారిగా సరిగ్గా ఏడాది క్రితం ఇండియా , న్యూజిలాండ్ జట్లు ఆడిన వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ లో బరిలో దిగిన ధోని , ఆ మ్యాచ్ లో చివర్లో రన్ అవుట్ కావడంతో టీమిండియా ఓటమి పాలు అయింది ..ఇక అప్పటినుంచి ఇంతవరకు ధోని మళ్ళీ మైదానము లో బరిలోకి దిగలేదు..ఐపీయల్ లో బరిలో దిగుతాడు అని అభిమానులు ఆనందపడుతున్న వేళ కరోనా కారణంగా ఐపీయల్ వాయిదా పడటంతో మళ్ళీ అభిమానులు నిరాశ చెందారు ..అయితే సచిన్ తర్వాత ఇండియన్ క్రికెట్ లో అంతటి స్థాయిని అందుకున్న ధోని సచిన్ లాగానే రిటైర్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు ..ఈ రోజు జులై 7 ..ధోని అభిమానులందరికి పండగ రోజు..ఎందుకంటే ఈ రోజు ధోని బర్త్డే ..ప్రపంచ వ్యాప్తంగా ధోని పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు ..హ్యాపీ బర్త్డే ధోని

Tags :
|
|

Advertisement