Advertisement

  • టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు నెగ్గే సత్తా భారత హాకీ జట్లకు ఉంది

టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు నెగ్గే సత్తా భారత హాకీ జట్లకు ఉంది

By: chandrasekar Fri, 24 July 2020 08:41 AM

టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు నెగ్గే సత్తా భారత హాకీ జట్లకు ఉంది


పురుషుల జట్టు కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌, మహిళల జట్టు కెప్టెన్‌ రాణి రాంపాల్ వచ్చే ఏడాది ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు నెగ్గే సత్తా భారత హాకీ జట్లకు ఉందని ‌ అభిప్రాయపడ్డారు. ఏడాది కాలంగా రెండు జట్లు మంచి జోరుమీదున్నాయని ఈసారి పతకాలు నెగ్గడం పక్కా అని గురువారం అన్నారు.


‘ఇటీవలి కాలంలో మేటి జట్లను ఓడించాం. ఆటపై మంచి పట్టు సాధించాం. ఇదే జోరులో ఒలింపిక్‌ పతకం సాధించి దేశం గర్వపడేలా చేస్తాం’ అని రాణి రాంపాల్‌ చెప్పింది. విశ్వక్రీడలకు ఇంకా ఏడాది సమయం ఉండటంతో ఈలోపు జట్టులో ఉన్న చిన్న లోటుపాట్లను కూడా సవరించుకొని పూర్తిస్థాయిలో సన్నద్ధమై టోక్యోలో అడుగుపెడతాం అని విశ్వాసం వ్యక్తం చేసింది.


‘ఏడాదిగా మా జట్టు మంచి ఫలితాలు సాధిస్తున్నది. ఇదే ఊపు కొనసాగిస్తే టోక్యోలో పతకం సాధించడం పెద్ద కష్టం కాదు. విశ్వక్రీడలకు ఇంకా తగినంత సమయం ఉంది’ అని హాకీ ఇండియా ఇంటర్వ్యూలో మన్‌ప్రీత్‌ పేర్కొన్నాడు.

Tags :
|

Advertisement