Advertisement

  • త్వరలో 12 సుఖోయ్ ఫైటర్ జెట్స్ ను కొనుగోలు చేయనున్న భారత ప్రభుత్వం

త్వరలో 12 సుఖోయ్ ఫైటర్ జెట్స్ ను కొనుగోలు చేయనున్న భారత ప్రభుత్వం

By: chandrasekar Fri, 03 July 2020 10:31 AM

త్వరలో 12 సుఖోయ్ ఫైటర్ జెట్స్ ను కొనుగోలు చేయనున్న భారత ప్రభుత్వం


లడ్డాఖ్ లోని గల్వాన్ లోయ లో జరిగిన ఇండో చైనా సైనికుల ఘర్షణ కీలక మార్పులకు కారణమవుతోంది. రెండ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులతో పాటు యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ నేపధ్యంలో భారత త్రివిధ బలగాల్ని బలోపేతం చేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది ప్రభుత్వం.

భారత చైనా సరిహద్దు వివాదం, ఉద్రిక్తతల నేపధ్యంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరిన్ని యుద్ధవిమానాల్ని కొనుగోలు చేసుకునేందుకు అనుమతిచ్చింది. ఈ నిర్ణయంతో భారత్ త్వరలో 12 సుఖోయ్ ఫైటర్ జెట్స్ ను కొనుగోలు చేయనుంది.

ముఖ్యంగా డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. 21 మిగ్ 29 యుద్దవిమానాలు, 59 ఎంఐజీ 29 జెట్స్ ను ఆధునీకరించేందుకు పచ్చజెండా ఊపింది. అంతేకాకుండా ప్రతిపాదన దశలో ఉన్న 12 సుఖోయ్ యుద్ధ విమానాల్ని కొనుగోలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ అనుమతులతో 12 ఎస్ యూ 20 ఎంకేఐ లను వాయుసేన కొనుగోలు చేయనుంది. సుఖోయ్ విమానాల కొనుగోలు నిమిత్తం 10 వేల 7 వందల కోట్లు ఖర్చు చేయనుండగా ఆధునీకరణ నిమిత్తం 7 వేల 4 వందల కోట్ల రూపాయల్ని వెచ్చించనున్నారు. వాస్తవానికి ఫైటర్ జెట్స్ కొనుగోలు, ఆధునీకరణ కోసం చాలాకాలంగా వాయుసేన అభ్యర్దిస్తోంది.

రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ అధ్యక్షతన జరిగిన డీఏసీ మొత్తం 38 వేల 9 వందల కోట్ల రూపాయల బడ్జెట్ ను ఆమోదించింది. ఇందులో ఆయుధ సామగ్రి, రక్షణ పరికరాల కొనుగోలు ఉన్నాయి. వీటిలో 31 వేల 130 కోట్ల విలువైన సామగ్రి మాత్రం ఇండియన్ పరిశ్రమల్నించే కొనుగోలు చేస్తారు. ఈ కొనుగోలు పూర్తయితే భారత వాయుసేనలోని ఫైటర్ జెట్స్ విభాగం మరింతగా బలమవుతుంది. ఇక ఇప్పటికే రాఫెల్ యుద్దవిమానాల రాకతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ శక్తివంతంగా మారింది. చైనాతో యుద్దం ప్రారంభమైతే అన్నివిదాలుగా సంసిద్ధంగా ఉండేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Tags :
|

Advertisement