Advertisement

  • ప్రజల భద్రత దృష్ట్యా 59 చైనా యాప్స్ ను నిషేదించిన కేంద్రం

ప్రజల భద్రత దృష్ట్యా 59 చైనా యాప్స్ ను నిషేదించిన కేంద్రం

By: Sankar Tue, 30 June 2020 11:53 AM

ప్రజల భద్రత దృష్ట్యా 59  చైనా యాప్స్ ను నిషేదించిన కేంద్రం



భారత్ -చైనా సంఘర్షణల నేపథ్యంలో చైనా వస్తువులను , చైనా యాప్ లను బ్యాన్ చేయాలనీ ప్రజలు ప్రభుత్వాన్ని ఇటీవల డిమాండ్ చేసారు ..దేశవ్యాప్తంగా నిరసనలు కూడా జరిగాయి ..అయితే దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, రక్షణ, ప్రజాభద్రత దృష్ట్యా మొత్తం 59 యాప్‌లపై నిషేధం విధిస్తున్నట్టు కేంద్ర సర్కారు ప్రకటించింది. ఈ ప్రకటనలో చైనా పేరు ఎక్కడా ప్రస్తావించకపోయినా.. దాదాపు ఈ యాప్‌లన్నీ చైనాకు చెందినవే. బాగా పాపులర్‌ అయిన టిక్‌టాక్, హెలో, యూసీ బ్రౌజర్, న్యూస్‌ డాగ్‌ వంటి యాప్‌లు సహా మొత్తం 59 యాప్‌లు ఈ జాబితాలో ఉన్నాయి.

భద్రతాపరమైన కారణాల దృష్ట్యా వీట న్నింటిపై నిషేధం విధిస్తున్నట్టు కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖ సోమవారం రాత్రి ప్రకటించింది. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్‌ 69ఏ, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ నిబంధనలు–2009ని అనుసరించి భద్రతాపరంగా పొంచి ఉన్న ముప్పు ఆధారంగా 59 యాప్‌లను నిషేధిస్తున్నట్టు తెలిపింది. ఇవి దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, దేశరక్షణ, ప్రజా భద్రతకు హాని కలిగించే కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నట్టు సమాచారం ఉందని కేంద్రం స్పష్టం చేసింది. 130 కోట్ల మంది భారతీయుల గోప్యతను కాపాడాల్సి ఉందని అభిప్రాయపడింది.

ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ ప్లాట్‌ఫామ్‌లలో లభ్యమయ్యే కొన్ని మొబైల్‌ యాప్‌లు భారతదేశం వెలుపల ఉన్న సర్వర్లకు మన దేశ వినియోగదారుల డేటాను అనధికారికంగా చేరవేస్తున్నట్లు, రహస్యంగా, దొంగతనంగా డేటాను పంపిస్తున్నట్టు ఐటీ శాఖకు అనేక ఫిర్యాదులు అందాయి. ఇది చాలా ఆందోళన కలిగించే విషయమైనందున అత్యవసర చర్యలు చేపట్టినట్టు కేంద్రం వెల్లడించింది.

ఈ హానికరమైన యాప్‌లను నిరోధించడానికి భారత సైబర్‌ క్రైమ్‌ కో–ఆర్డినేషన్‌ సెంటర్, హోం మంత్రిత్వ శాఖ కూడా సమగ్ర సిఫార్సులను పం పాయి.దీనితో వీటిని నిషేదించారు అయితే ఈ చర్య కోట్లాది మంది భారతీయ మొబైల్, ఇంటర్నెట్‌ వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షిస్తుందని తెలిపింది. ఈ నిర్ణయం భారత సైబర్‌ స్పేస్‌ భద్రత, సార్వభౌమత్వాన్ని పటిష్టం చేసుకునే దిశగా తీసుకున్న చర్యగా అభివర్ణించింది.

Tags :
|
|
|
|
|
|

Advertisement