Advertisement

  • రాయుడు ఉంటే మ్యాచ్ మరోలా ఉండేది ...ఇండియన్ క్రికెట్ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్యెస్కె ప్రసాద్

రాయుడు ఉంటే మ్యాచ్ మరోలా ఉండేది ...ఇండియన్ క్రికెట్ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్యెస్కె ప్రసాద్

By: Sankar Fri, 25 Sept 2020 5:36 PM

రాయుడు ఉంటే మ్యాచ్ మరోలా ఉండేది ...ఇండియన్ క్రికెట్ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్యెస్కె ప్రసాద్


ఐపీఎల్ 2020 లో నాలుగో మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో ఎంఎస్ ధోని నేతృత్వంలోని చెన్నై జట్టు 16 పరుగుల తేడాతో స్మిత్ కెప్టెన్సీలోని రాజస్థాన్ చేతిలో ఓడిపోయింది. మొదట బ్యాటిగ్ చేసిన రాజస్థాన్ 216 పరుగులు చేయగా చెన్నై 200 కే పరిమితం అయ్యింది.

అయితే ఈ మ్యాచ్ కు తెలుగు కామెంటేటర్ గా వ్యవరించిన భారత మాజీ చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ అంబటి రాయుడిని పొగిడాడు. రాయుడు లేని లోటు ఈ మ్యాచ్ లో స్పష్టంగా కనిపించింది అని రాయుడు ఉంటె ఈ మ్యాచ్ మరోలా ఉండేది అని చెప్పుకొచ్చాడు. అయితే ఫిట్ నెస్ కారణంగా రాయుడు ఈ మ్యాచ్ దూరం అయినట్లు ధోని తెలిపాడు. ఇక రాయుడిని ఎంఎస్కే ప్రసాద్ పొగడటంతో ప్రేక్షకులు అందరూ షాక్ అయ్యారు.

గత ఏడాది ప్రపంచ కప్ సమయంలో రాయుడిని సెలక్ట్ చేయకుండా విజయ్ శంకర్ ను ఇంగ్లాండ్ పంపించారు. దాంతో అసంతృప్తికి లోనైనా రాయుడు అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కానీ తర్వాత దానిని వెనక్కి తీసుకున్నాడు. ఆ తర్వాత ఈ ఏడాది ఐపీఎల్ కోసం ఎదురు చూసిన రాయుడు మొదటి మ్యాచ్ లోనే 71 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఈ రోజు చెన్నై జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ తో ఆడనుంది. మరి ఈ మ్యాచ్ లో రాయుడు ఆడుతాడా... లేదా అనేది చూడాలి

Tags :

Advertisement