Advertisement

భారత తొలి ఆస్కార్ అవార్డు గ్రహీత ఇక లేరు

By: Sankar Thu, 15 Oct 2020 8:05 PM

భారత తొలి ఆస్కార్ అవార్డు గ్రహీత ఇక లేరు


భారతదేశానికి తొలి ఆస్కార్ అవార్డును అందించిన ప్రఖ్యాత కాస్ట్యూమ్ డిజైనర్ భాను అథియా ఇక లేరు. దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గురువారం తుదిశ్వాస తీసుకున్నారు.

ఈ విషయాన్ని ఆమె కుమార్తె రాధిక గుప్తా ధృవీకరించారు. ఎనిమిది సంవత్సరాల క్రితం, మెదడులో కణితి కారణంగా గత మూడేళ్లుగా, ఆమె మంచానికే పరిమితయ్యారని తెలిపారు. చివరకు గురువారం తెల్లవారు ఝామున నిద్రలోనే కన్నుమూసినట్టు ఆమె చెప్పారు. దక్షిణ ముంబైలోని చందన్‌వాడి శ్మశానవాటికలో తమ తల్లి అంత్యక్రియలను పూర్తి చేసినట్టు రాధిక ప్రకటించారు.

1982 లో గాంధీ చిత్రానికి దుస్తుల రూపకల్పనలో ఆమె కృషికి గాను కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఆస్కార్ అవార్డు అందుకున్నారు. తద్వారా ఆస్కార్ అకాడమీ అవార్డు గెలుచుకున్న తొలి భారతీయురాలిగా అథియా ఘనత దక్కించుకున్నారు. కొల్లాపూర్‌లో జన్మించిన అథయ్య ఈవ్స్ వీక్లీ'తో సహా బొంబాయిలోని వివిధ మహిళా పత్రికలకు ఫ్రీలాన్స్ రచయితగా తన వృత్తిని ప్రారంభించారు. పత్రిక ఎడిటర్ కోరిక మేరకు దుస్తులను డిజైన్ చేసిన భాను క్రమంగా తన లోని నైపుణ్యానికి పదును పెట్టి డిజైనర్‌గా రాణించారు.

Tags :
|
|

Advertisement