Advertisement

  • హర్భజన్ బౌలింగ్ లో అవుట్ అయిన ప్రతిసారి భారత ఫీల్డర్లు ఎదో అనేవారు ..ఆస్ట్రేలియా స్టార్ కీపర్

హర్భజన్ బౌలింగ్ లో అవుట్ అయిన ప్రతిసారి భారత ఫీల్డర్లు ఎదో అనేవారు ..ఆస్ట్రేలియా స్టార్ కీపర్

By: Sankar Fri, 07 Aug 2020 08:34 AM

హర్భజన్ బౌలింగ్ లో అవుట్ అయిన ప్రతిసారి భారత ఫీల్డర్లు ఎదో అనేవారు ..ఆస్ట్రేలియా స్టార్ కీపర్



క్రికెట్ లో స్లెడ్జింగ్ అనగానే ముందుగా గుర్తొచ్చే దేశం ఆస్ట్రేలియా..అయితే ఇండియా ఆస్ట్రేలియా మధ్య ఎప్పుడు సిరీస్ జరిగిన కూడా ఆస్ట్రేలియన్లు స్లెడ్జింగ్ తో భారత ఆటగాళ్ల మీద విరుచుకుపడేవారు ..ముఖ్యంగా 2008 లో జరిగిన సిడ్నీ టెస్ట్ లో ఇది మరింత వివాదాన్ని రేపింది సైమండ్స్ ను మంకీ అన్నాడని హర్భజన్ మీద ఆరోపణలు చేసింది ఆస్ట్రేలియా టీం.అప్పట్లో ఈ మంకీ గేట్ వివాదం పెద్ద దుమారాన్నే రేపింది .. అయితే ఆ వివాదం పెద్దది కాకుండా చేయడంలో సచిన్‌ టెండూల్కర్‌ కీలక పాత్ర పోషించాడు..

అయితే హర్భజన్‌ సింగ్‌ తనను ఔట్‌ చేసిన సందర్భంలో భారత ఫీల్డర్లు ఒకే పదాన్ని ఎక్కువ ఉపయోగించేవారని ఆసీస్‌ మాజీ ఓపెనర్‌ ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ గుర్తు చేసుకున్నాడు. లైవ్‌ కనెక్ట్‌ షోలో భాగంగా టీవీ ప్రెజంటర్‌ మడోనా టిక్సెరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్‌తో క్రికెట్‌ మ్యాచ్‌ల విషయాలను ప్రత్యేకంగా ప్రస్తావించాడు గిల్‌క్రిస్ట్‌.ఈ క్రమంలోనే ఒకనాడు భారత ఫీల్డర్‌ ఉపయోగించే ఆ పదానికి అర్థం ఏమిటో ఇప్పటికీ తెలీదన్నాడు. ఇప్పుడు ఆ పదాన్ని కూడా మరిచిపోయానని గిల్లీ చెప్పుకొచ్చాడు. ప్రధానంగా భజ్జీ బౌలింగ్‌లో తాను ఔటైన సందర్భంలోనే ఆ పదాన్ని వాడేవారన్నాడు.

ఇక భారత్‌లో ఎప్పుడూ తమకు గ్రాండ్‌ వెల్‌కమ్‌ ఉండేదని గిల్లీ గుర్తు చేసుకున్నాడు. అయితే ముంబైలో తనకు ఎదురైన ఫన్నీ ఘటనను గిల్లీ ప్రస్తావించాడు. ఒక మార్నింగ్‌ తాను ఒకచోట జాగింగ్‌ చేస్తుంటే క్రికెట్‌ ఫ్యాన్స్‌ పరుగులు పెట్టించారన్నాడు. తాను సన్‌గ్లాసెస్‌, ఇయర్‌ ఫోన్స్‌, తలపై హ్యాట్‌ పెట్టుకోవడమే కాకుండా తల కిందకు వంచి జాగింగ్‌ చేసుకుంటుంటే కొంతమంది తనను ఆపేశారన్నాడు. ఈ క్రమంలో తనను గుర్తించి ఒక ఫోటో కోసం వెంటపడ్డారన్నాడు. ఇది చాలా సరదాగా అనిపించిందని గిల్లీ పేర్కొన్నాడు. తాను మళ్లీ ఎప్పుడు భారత్‌కు వస్తానో తెలీదన్న గిల్లీ.. భారత్‌కు రావడమంటే ఎప్పుడూ కొత్తగా ఉంటుందన్నాడు.

Tags :
|
|
|
|

Advertisement