Advertisement

  • రష్యా కరోనా వ్యాక్సిన్ కోసం భారత రాయబార కార్యాలయం సంప్రదింపులు

రష్యా కరోనా వ్యాక్సిన్ కోసం భారత రాయబార కార్యాలయం సంప్రదింపులు

By: chandrasekar Wed, 19 Aug 2020 10:00 AM

రష్యా కరోనా వ్యాక్సిన్ కోసం భారత రాయబార కార్యాలయం సంప్రదింపులు


రష్యా కరోనా వ్యాక్సిన్ కోసం భారత రాయబార కార్యాలయం సంప్రదింపులు జరుపుతున్నాయి. రష్యా కరోనా వ్యాక్సిన్ 'స్పుత్నిక్‌-వి' పై భారత్‌ ఆసక్తి చూపిస్తున్నది. వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌కు సంబంధించిన సమాచారాన్ని తమకు అందించాలని రష్యాను భారత్‌ కోరుతున్నది.ఈ నేపథ్యంలోనే మాస్కోలోని భారత రాయబార కార్యాలయం రష్యాన్‌ మెడికల్‌ రీసెర్చ్‌ సంస్థతో సంప్రదింపులు జరుపుతోంది. ప్రపంచంలోనే తొలి కొవిడ్‌-19 వ్యాక్సీన్‌ను అత్యవసర ప్రాతిపదికన రష్యా వినియోగంలోకి తీసుకొచ్చింది. ఈ వాక్సిన్ ట్రయల్స్ ఏవిధంగా పనిచేస్తుందో గుర్తించడానికి వివరాలు కోరినట్లు సమాచారం.

ఈ వాక్సిన్ కోసం మాస్కోలోని భారత రాయబార కార్యాలయం ద్వారా ఇండియన్‌ మిషన్‌ రష్యాతో ప్రత్యేకంగా చర్చలు జరుపుతున్నది. కరోనా టీకా భద్రత, సామర్థ్యం తదితర సమాచారం కోసం ఎదురుచూస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌కు తెలిపాయి. స్పుత్నిక్‌-వి టీకాను రష్యాకు చెందిన గమేలియా రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎపిడెమలాజీ, మైక్రోబయాలజీ సంస్థ అభివృద్ధి చేసింది. మన దేశంతో బాటు అనేక దేశాలు కూడా దీనికోసం రష్యాను సంప్రదించినట్లు తెలిసింది.

Tags :
|

Advertisement