Advertisement

  • వచ్చే ఏడాది భారత ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుంది ..ఎస్ అండ్ పీ రేటింగ్

వచ్చే ఏడాది భారత ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుంది ..ఎస్ అండ్ పీ రేటింగ్

By: Sankar Wed, 16 Dec 2020 1:11 PM

వచ్చే ఏడాది భారత ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుంది ..ఎస్ అండ్ పీ రేటింగ్


కరోనా కారణంగా ప్రపంచంలోని అన్ని దేశాలు కుదేలయ్యాయి..కరోనా దెబ్బకి ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో ఆర్థికంగా బాగా దెబ్బపడింది...అయితే లాక్ డౌన్ ముగిసిన తర్వాత ఇప్పుడిప్పుడే దేశంలో ఆర్థిక వ్యవస్థ ఊపుఅందుకుంటుంది...

దీనితో వచ్చే ఏడాది వృద్ధి రేటు 10 శాతం వరకు ఉంటుందని అంచనా వేసింది. భారత ఆర్థికవ్యవస్థ వేగంగా రికవరీ బాట పడుతోందని, చెబుతూ వివిధ రేటింగ్ ఏజెన్సీలు అంచనాలను సవరిస్తున్నాయి. తాజాగా ఎస్ అండ్ పీ మరోసారి కాస్త సానుకూలంగా సవరించింది.

2021-22 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి తిరిగి గాడిలో పడటంతో పాటు ఏకంగా 10 శాతం నమోదు చేయవచ్చునని ఎస్ అండ్ పీ అంచనా వేసింది. డిమాండ్ పుంజుకోవడం, కరోనా వ్యాప్తి రేటు తగ్గుముఖం పట్టడంతో ఆర్థిక రికవరీ గతంలో అనుకున్న దాని కంటే వేగంగా పుంజుకుంటుందని, అందుకే వృద్ధి రేటును సవరించినట్లు ఎస్ అండ్ పీ తెలిపింది

Tags :
|
|

Advertisement