Advertisement

  • ఇండియన్ క్రికెట్ లో హల్చల్ చేస్తున్న జెండర్ స్వాప్ యాప్

ఇండియన్ క్రికెట్ లో హల్చల్ చేస్తున్న జెండర్ స్వాప్ యాప్

By: Sankar Wed, 24 June 2020 8:49 PM

ఇండియన్ క్రికెట్ లో హల్చల్  చేస్తున్న జెండర్ స్వాప్ యాప్



కరోనా కారణంగా ఎటువంటి క్రికెట్ మ్యాచ్ లు లేకపోవడంతో క్రికెటర్లు అందరూ సోషల్ మీడియాలో బిజీ గా గడుపుతున్నారు ..కొద్దీ కాలం క్రితం వరకు ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ , ఇండియన్ స్పిన్నర్ చాహల్ తమ టిక్ టాక్ వీడియోలతో అలరిస్తే తాజాగా జెండర్ స్వాప్ ఆప్ తో క్రికెటర్లు అభిమానులను అలరిస్తున్నారు ..జెండర్ స్వాప్ యాప్ అంటే అబ్బాయిల గా ఉన్న వాలని అమ్మాయిల గా మార్చడం లేదా అమ్మాయిలుగా ఉన్న వాళ్ళని అబ్బాయిలుగా మార్చడం ..దీనిని కూడా స్పిన్నర్ చాహల్ ఏ ప్రాచుర్యంలోకి తెచ్చాడు ..

మొదట టీం ఇండియా హిట్ మాన్ రోహిత్ శర్మ ఫోటోను స్వాప్ చేసి సోషల్ మీడియా లో చ్చ్ల పెట్టడంతో ఇది ఫేమస్ అయింది ..యువరాజ్‌ సింగ్‌లు సహచర క్రికెటర్లను జెండర్‌ స్వాప్‌లో మహిళలుగా మార్చిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. ఇక యువీ ఓ అడుగు ముందుకేసి ‘ఇందులో మీరు ఎవరిని గర్ల్‌ఫ్రెండ్‌గా ఎంచుకుంటారు’ అని ప్రశ్నించారు. దీంతో నెటిజన్లు, సహచర క్రికెటర్లు ఎవరికి నచ్చినట్లు వారు కామెంట్‌ చేశారు. భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా ఉన్నాడు అంటూ ఎక్కువగా కామెంట్స్ చేసారు ..

తాజాగా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ కూడా యువీ బాట పట్టారు. యువీ ప్రస్తుత టీమిండియా క్రికెటర్ల జెండర్‌ స్వాప్‌ ఫోటోలను షేర్‌ చేయగా.. భజ్జీ గతంలో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన ఆటగాళ్ల జెండర్‌ స్వాప్‌ ఫోటోలను అభిమానులతో పంచుకున్నాడు. అంతేకాకుండా ఇందులో ఉన్న వారిలో ఎవరితో డేట్‌కు వెళతారు అని హర్భజన్‌ సరదాగా ప్రశ్నించారు. ఈ జాబితాలో సచిన్‌ టెండూల్కర్‌, సౌరవ్‌ గంగూలీ, నెహ్రా, జహీర్‌ ఖాన్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, హర్భజన్‌ సింగ్‌, యువీ, గంభీర్‌లు ఉన్నారు. అయితే భజ్జీ పోస్ట్‌పై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ స్పందించారు. కళ్లద్దాలతో మధ్యలో ఉన్న అమ్మాయితో డేట్‌కు వెళతానని దాదా సరదాగా కామెంట్‌ చేశారు. ప్రస్తుతం భజ్జీ చేసిన పోస్ట్‌, దాదా కామెంట్‌కు సంబంధించిన కామెంట్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.

Tags :
|
|
|

Advertisement