Advertisement

కొత్త లుక్‌లో భారత క్రికెట్‌ జట్టు...

By: chandrasekar Wed, 18 Nov 2020 5:15 PM

కొత్త లుక్‌లో భారత క్రికెట్‌ జట్టు...


బీసీసీఐతో 'నైకీ’ 15 ఏళ్ల బంధానికి ముగింపు పలికింది. టీమిండియాకు ఇనాళ్ళు కిట్‌ స్పాన్సర్‌గా ఉన్న ఈ స్పోర్టింగ్‌ కంపెనీ కాంట్రాక్టు అధికారికంగా ముగిసింది. నైకీ స్థానంలో ఎంపీఎల్‌ స్పోర్ట్స్‌ అపెరల్‌ అండ్‌ యాక్సెసరీస్‌ సంస్థకు కిట్‌ అండ్‌ మర్కండైజ్‌ స్పాన్సర్‌ హక్కులను అప్పగించింది బీసీసీఐ. మొబైల్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఎంపీఎల్‌)కు చెందిన ఎంపీఎల్‌ స్పోర్ట్స్‌ ఇక నుంచి భారత్ తరుపున ఆడే అన్ని క్రికెట్ జట్లకు కిట్ స్పాన్సర్ చేయనుంది. పురుషుల, మహిళల జాతీయ జట్లతో పాటు అండర్‌–19 టీమ్‌ల జెర్సీలపై ‘ఎంపీఎల్‌’ లోగో దర్శనమివ్వనుంది. బెంగళూరు కేంద్రంగా పని చేసే ఈ గేమింగ్‌ కంపెనీకి గరిమెళ్ల సాయి శ్రీనివాస్‌ కిరణ్, శుభమ్‌ మల్హోత్రా డైరెక్టర్‌లుగా ఉన్నారు. 2023 డిసెంబర్‌ వరకు ఎంపీఎల్‌.. టీమిండియాకు స్పాన్సర్‌గా ఉంటుంది. ఈ స్పాన్సర్‌షిప్‌తో టీమిండియా అధికారిక జెర్సీలతో పాటు ఇతర క్రీడా సామగ్రిని అమ్ముకునేందుకు కూడా ఎంపీఎల్‌కు హక్కులు లభిస్తాయి.

ప్రస్తుతం ఐపీఎల్‌లో కోల్‌కతా, బెంగళూరు జట్లక ప్రాంఛైజీలతో ఎంపీఎల్‌‌కు ఒప్పందం ఉంది. అలాగే అంతార్జాతీయ జట్లు ఐర్లాండ్, యూఏఈ జట్లకు కూడా స్పాన్సర్‌గా వ్వవహరిస్తోంది. ఎంపీఎల్‌కు స్టార్ క్రికెటర్లు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారు. ఇక కిట్ స్ఫాన్సర్‌ రూపంలో భారత జట్టు ఆడే ప్రతి మ్యాచ్‌కీ రూ. 65 లక్షలు ఎంపీఎల్ చెల్లించనుంది. గతంలో నైక్ సంస్థ ఒక మ్యాచ్‌కు 88 ల‌క్షలు ఇచ్చేది. బీసీసీఐ,నైక్ మధ్య జరిగిన ఓ డిల్ వ్వవహారంలో తేడాలు రావడంతోనే ఆ సంస్థ స్పాన్సర్‌షిప్ నుంచి వైదొలిగినట్లు సమాచారం. దీంతో ఎంపీఎల్‌ కొత్త కిట్ స్ఫాన్సర్‌షిప్‌గా ఛాన్స్‌ దక్కింది. ఈ ఒప్పందం విలువ మెుత్తం 120 కోట్లుగా ఉంది. ఈ ఒప్పందంపై బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. టీమిండియా కిట్‌లో ఎంపీఎల్ స్పోర్ట్స్‌ కొత్త అధ్యయాన్ని సృష్టించాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు.

Tags :
|
|

Advertisement