Advertisement

  • ఇండియన్ క్రికెట్లో ఆ అద్భుత ఘట్టానికి నేటితో 37 ఏళ్ళు

ఇండియన్ క్రికెట్లో ఆ అద్భుత ఘట్టానికి నేటితో 37 ఏళ్ళు

By: Sankar Thu, 25 June 2020 8:33 PM

ఇండియన్ క్రికెట్లో ఆ అద్భుత ఘట్టానికి నేటితో 37  ఏళ్ళు



ఆ మ్యాచ్ కు ముందు వరకు ఇండియాలో క్రీడలు అంటే అందరికి హాకీ గుర్తుకు వచ్చేది అయితే ఒక్క మ్యాచ్ , ఒకే ఒక్క మ్యాచ్ ఇండియా లో క్రీడల స్థితిని గతిని మార్చేసింది అదే ఇండియా ,వెస్ట్ ఇండీస్ జట్ల మధ్య 1983 ప్రపంచకప్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ..ఆ మ్యాచ్ లో కపిల్‌దేవ్ సారధ్యంలో టీం ఇండియా దిగ్గజ వెస్ట్ ఇండీస్ జట్టుపై సంచలన విజయం సాధించడంతో ఒక్కసారిగా ఇండియాలో ఉన్న యువత క్రికెట్ వైపుకు మళ్లారు ..అయితే అద్భుతం జరిగి సరిగ్గా 37 ఏళ్ళు అయింది ..

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి భారత్‌కు బ్యాటింగ్ అప్పగించిన విండీస్ చెలరేగిపోయింది. భారత బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించింది. బౌలర్లు జోయెల్ గార్నర్ నాలుగు వికెట్లు తీయగా, ఆండీ రాబర్ట్స్ 3, మైఖేల్ హోల్డింగ్ రెండు వికెట్లు తీసి భారత బ్యాట్స్‌మెన్‌కు ముచ్చెమటలు పట్టించారు. దీంతో భారత జట్టు 54.4 ఓవర్లలో 183 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ గవాస్కర్ (2) ఘోరంగా విఫలమయ్యాడు. మొహిందర్ అమర్‌నాథ్ (26), సందీప్ పాటిల్ (27) పరవాలేదనిపించారు. కెప్టెన్ కపిల్ దేవ్ 15 పరుగులే చేసి పెవియన్ చేరాడు. దీంతో విండీస్ ఎదుట అతి స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే ఉంచగలిగింది.


అయితే కపిల్‌దేవ్ స్ఫూర్తినింపే మాటలు బౌలర్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. ఫలితంగా మదన్‌లాల్, అమర్‌నాథ్ వంటి వారు బౌలింగులో చెలరేగిపోయారు. మదన్‌లాల్ 3, అమర్‌నాథ్ 3 వికెట్లు తీసి విండీస్‌ను ఒత్తిడిలోకి నెట్టేశారు. 66 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన విండీస్ ఆత్మరక్షణలో పడింది. గార్డన్ గ్రీనిడ్జ్ (1), డెస్మండ్ హేన్స్ (13), దిగ్గజ ఆటగాడు వివ్ రిచర్డ్స్ (33) కూడా పెవిలియన్ చేరడంతో మ్యాచ్‌పై భారత జట్టు పట్టు బిగించింది. జెఫ్ డూజాన్ (25), మాల్కం మార్షల్(18) మెరుపులు మెరిపించినప్పటికీ భారత బౌలర్ల ముందు వారి ఆటలు సాగలేదు. ఫలితంగా 140 పరుగులకే విండీస్ జట్టు కుప్పకూలింది.దీనితో టీమిండియా తొలిసారిగా కప్పును ముద్దాడింది ..ఆ తర్వాత ధోని సారధ్యంలో 2011 లో టీమిండియా రెండవ సారి కప్పును అందుకుంది..



Tags :
|
|

Advertisement