Advertisement

  • టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టిక మార్పుపై ఐసీసీ మీద ఫైర్ అయిన కోహ్లీ

టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టిక మార్పుపై ఐసీసీ మీద ఫైర్ అయిన కోహ్లీ

By: Sankar Sun, 29 Nov 2020 7:25 PM

టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టిక మార్పుపై ఐసీసీ మీద ఫైర్ అయిన కోహ్లీ


టెస్టు ఛాంపియన్‌షిప్‌ పాయింట్లను లెక్కించే ప్రక్రియను ఎందుకు మార్చారో అర్థంకావడం లేదని టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ అన్నాడు. టెస్ట్ చాంపియ‌న్‌షిప్‌కు సంబంధించిన రూల్స్‌ను అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి తాజాగా మార్చేసింది.

ఆడిన టెస్ట్ మ్యాచ్‌ల ఆధారంగా వ‌చ్చిన పాయింట్ల‌తో ఆయా జ‌ట్ల‌కు ర్యాంకులు ఇవ్వ‌నున్న‌ట్లు ఐసీసీ వెల్ల‌డించింది. పాయింట్ల కేటాయింపు విధానంలో ఐసీసీ మార్పులు చేయడంతో.. టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్ రెండో స్థానానికి పడిపోయింది. భారత్‌ను వెనక్కి నెడుతూ ఆస్ట్రేలియా అగ్రస్థానానికి చేరుకుంది.

ముందు పాయింట్ల పరంగా టాప్‌-2లో నిలిచిన జట్లతో ఫైనల్‌ ఆడిస్తామని చెప్పి.. ఇప్పుడు విజయాల శాతం ఎందుకు లెక్కిస్తున్నారు' అని విరాట్ కోహ్లీ ప్రశ్నించాడు. 2019 ఆగస్టు నుంచి టెస్టు ఛాంపియన్‌షిప్ ప్రారంభం అయింది. ఇప్పటివరకూ నాలుగు టెస్టు సిరీస్‌లను భారత్ ఆడింది. కోహ్లీసేన 9 మ్యాచ్‌లు ఆడి.. ఏడింట్లో గెలిచి, రెండింటిలో ఓడిపోయింది. మొత్తంగా 480 పాయింట్లకి భారత్ 360 పాయింట్లు సాధించింది.

Tags :
|
|
|

Advertisement