Advertisement

  • నాలుగు రోజుల‌పాటు భార‌త సైన్యం క‌మాండ‌ర్లు స‌మావేశం

నాలుగు రోజుల‌పాటు భార‌త సైన్యం క‌మాండ‌ర్లు స‌మావేశం

By: chandrasekar Mon, 26 Oct 2020 1:11 PM

నాలుగు రోజుల‌పాటు భార‌త సైన్యం క‌మాండ‌ర్లు స‌మావేశం


భారత్ మరియు చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం వల్ల మన దేశ క‌మాండ‌ర్లు స్థాయిలో సమావేశం జరగనుంది. స‌రిహ‌ద్దుల్లో ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో భార‌త సైన్యం క‌మాండ‌ర్లు స‌మావేశం కానున్నారు. నేటి నుంచి నాలుగు రోజుల‌పాటు ఈ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. ఈనెల 29 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న స‌మావేశాల్లో ఆర్మీ ఉపఅధిపతి, క‌మాండ‌ర్లు, సీనియ‌ర్ అధికారులు పాల్గొన‌నున్నారు.

శీతాకాలం రానున్న సందర్భంగా సరిహద్దు ప్రాంతాల్లో తీసికోవలసిన జాగ్రత్తలు గురించి చర్చించనున్నట్లు తెలుస్తుంది. ఈ సంద‌ర్భంగా స‌రిహ‌ద్దుల్లోని తూర్పు ల‌ఢ‌క్‌లో తాజా ప‌రిస్థితులు, వ్య‌యాల త‌గ్గింపున‌కు వ‌స్తున్న ప్ర‌తిపాద‌న‌ల‌పై చ‌ర్చించనున్నారు. ఇవాళ మాన‌వ వ‌న‌రుల అంశంపై చ‌ర్చించ‌నున్నామ‌ని అధికారులు తెలిపారు. ఈ భేటీలో ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా పాల్గొంటున్నార‌ని వెల్ల‌డించారు. ఆయ‌న రేపు ప్ర‌సంగిస్తార‌ని చెప్పారు. ‌చైనాతో స‌రిహ‌ద్దు ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో సైనిక క‌మాండ్ల భేటీకి ప్రాధాన్యం సంత‌రించుకున్న‌ది.

Tags :
|
|
|

Advertisement