Advertisement

  • రష్యా రాజధాని మాస్కోలో శుక్రవారం భారత్, చైనా రక్షణశాఖ మంత్రుల సమావేశం

రష్యా రాజధాని మాస్కోలో శుక్రవారం భారత్, చైనా రక్షణశాఖ మంత్రుల సమావేశం

By: chandrasekar Sat, 05 Sept 2020 10:07 AM

రష్యా రాజధాని మాస్కోలో శుక్రవారం భారత్, చైనా రక్షణశాఖ మంత్రుల సమావేశం


లడ‌ఖ్ స‌రిహ‌ద్దుల వద్ద ఏర్పడ్డ గొడవలు కారణంగా చైనా మరియు భారత్ దేశాల మధ్య ఉద్రిక్త‌త నెలకొన్న విషయం తెలిసిందే. భార‌త్‌, చైనా ర‌క్ష‌ణ‌శాఖ మంత్రులు ఇరువురు ర‌ష్యా రాజ‌ధాని మాస్కోలో శుక్ర‌వారం స‌మావేశ‌మ‌య్యారు. భార‌త ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చైనా ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి వీ ఫెన్‌గీ ఇరువురు స‌మావేశమ‌య్యారు. చర్చల్లో కీలకంగా చర్చించనున్నట్లు తెలిసింది.

ముందుగానే నిర్ణయించిన ప్రకారం మాస్కోలో జ‌రుగుతున్న‌ షాంఘై కోఆప‌రేష‌న్ ఆర్గ‌నైజేష‌న్‌(ఎస్‌సీవో) స‌మావేశంలో పాల్గొనేందుకు ఇరు దేశాల ర‌క్ష‌ణ‌శాఖ మంత్రులు వెళ్లారు. చైనా రక్షణ మంత్రి ఈ సమావేశం కోసం కోరినట్లుగా స‌మాచారం. భార‌త్‌, చైనా మ‌ధ్య లడ‌ఖ్ స‌రిహ‌ద్దు అంశం తీవ్ర ఉద్రిక్త‌త‌కు దారి తీసిన విష‌యం తెలిసిందే. ప‌లుమార్లు రెండు దేశాల సైనికులు వాస్త‌వాధీన రేఖ వ‌ద్ద ఘ‌ర్ష‌ణ‌కు కూడా దిగారు. ఇప్పుడు ఇది మరింత తీవ్ర స్థాయికి చేరుకోవడంతో సమావేశం ఏర్పాటు చేయబడింది.

ఈ వారంలో ఏపడిన ఉద్రిక్త‌త‌ల‌ను త‌గ్గించేందుకు రెండు దేశాలు సైనిక‌, దౌత్య‌ప‌ర‌మైన చ‌ర్చ‌లు కూడా చేప‌ట్టాయి. ఈ నేప‌థ్యంలోనే ఇవాళ చైనా ర‌క్ష‌ణ మంత్రి వీ ఫెన్‌గీ భార‌త‌ ర‌క్ష‌ణ‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో స‌మావేశ‌మ‌య్యారు. వాస్తవాధీన రేఖ వ‌ద్ద మే నెల నుంచి ఉద్రిక‌త్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఇవి ఇలాగే కొన‌సాగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఇరు దేశాల‌ ర‌క్ష‌ణ మంత్రులు క‌లుసుకోవ‌డం ఇదే మొద‌టిసారి. రాజ‌కీయంగా కూడా ఈ భేటీ కీల‌కం కానున్న‌ది. వీలైనంతవరకు సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుటకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Tags :
|

Advertisement