Advertisement

  • పాక్ ఎల్‌ఓసీ వద్ద ఉగ్రవాదుల స్థావరాలపై భారత్ ఎయిర్ స్ట్రైక్స్?

పాక్ ఎల్‌ఓసీ వద్ద ఉగ్రవాదుల స్థావరాలపై భారత్ ఎయిర్ స్ట్రైక్స్?

By: chandrasekar Fri, 20 Nov 2020 11:05 AM

పాక్ ఎల్‌ఓసీ వద్ద ఉగ్రవాదుల స్థావరాలపై భారత్ ఎయిర్ స్ట్రైక్స్?


పాక్ నుండి ఉగ్రవాదులు భారత్ లో చొరబడడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాదుల స్థావరాలపై భారత్ మరోమారు విరుచుకుపడినట్లు పీటీఐని ఉటంకిస్తూ జాతీయ మీడియా ఛానెళ్లు కథనాలు ప్రసారం చేస్తున్నాయి. భారత వైమానిక దాడుల్లో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు, 10 మంది పాక్ సైనికులు కూడా హతమయ్యారని, 20 మందికి పైగా గాయపడ్డారని జాతీయ మీడియా ప్రకటించింది. ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొచ్చుకు వచ్చేందుకు సిద్ధమౌతుండగా వైమానిక దాడులు జరిగినట్లుగా కథనాలు వెలువడ్డాయి.

అందుకోసం ఎల్‌ఓసీ వద్ద ఎయిర్ స్ట్రైక్స్ జరిపినట్లుగా జాతీయ మీడియా ఛానెళ్లలో ప్రసారమౌతున్న కథనాల్లో నిజం లేదని భారత ఆర్మీకి చెందిన లెఫ్టెనెంట్ జనరల్ పరమ్‌జిత్ స్పష్టం చేశారు. భారత్ గతంలో పీఓకేలోని బాలాకోట్‌‌లో ఉన్న ఉగ్రవాదుల స్థావరాలపై వైమానిక దాడులు జరిపింది. నాటి ఘటనలో ఉగ్రవాదులు పెద్ద సంఖ్యలో చనిపోయారు. ఉగ్రవాదుల చొరబాట్లను మన భద్రతా దళాలు దీటుగా ఎదుర్కొని హతమారుస్తావున్నారు.

Tags :
|
|

Advertisement