Advertisement

  • వైట్ వాష్ నుంచి తప్పించుకున్న టీమిండియా ...మూడో వన్ డే లో ఆసీస్ పై ఘనవిజయం

వైట్ వాష్ నుంచి తప్పించుకున్న టీమిండియా ...మూడో వన్ డే లో ఆసీస్ పై ఘనవిజయం

By: Sankar Wed, 02 Dec 2020 5:53 PM

వైట్ వాష్ నుంచి తప్పించుకున్న టీమిండియా ...మూడో వన్ డే లో ఆసీస్ పై ఘనవిజయం


ఆసీస్‌తో జరిగిన మూడో వన్డేలో టీమిండియాకు ఓదార్పు విజయం దక్కింది. 303 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ 49.3 ఓవర్లలో 289 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్‌ బ్యాటింగ్‌లో ఆరోన్‌ ఫించ్‌ 75 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. మ్యాక్స్‌వెల్‌ 59 పరగులతో రాణించాడు.భారత బౌలర్లలో శార్దూల ఠాకూర్ మూడు వికెట్లు తీసుకోగా , కెరీర్ లో తొలి మ్యాచ్ ఆడుతున్న నటరాజన్ రెండు , బుమ్రా రెండు , జడేజా , కుల్దీప్ చెరో వికెట్ తీసుకున్నారు...

ఇక అంతకుముందు మొదట బ్యాటింగ్‌ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. భారత బ్యాటింగ్‌లో హార్దిక్‌ పాండ్యా 92 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా, జడేజా 66, కోహ్లి 63 పరుగులతో రాణించారు. పాండ్యా, జడేజాలు కలిసి ఆరో వికెట్‌కు 150 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పడం టీమిండియా ఇన్నింగ్స్‌లో హైలెట్‌గా నిలిచింది.

కాగా ఇప్పటికే తొలి రెండు వన్డేలు ఓడిన భారత్‌ సిరీస్‌ను 2-1 తేడాతో ఆస్ట్రేలియాకు అప్పగించింది. ఇరు జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా మొదటి టీ20 డిసెండర్‌ 4 శుక్రవారం ఇదే స్టేడియంలో జరగనుంది

Tags :
|
|

Advertisement