Advertisement

  • పాక్ పై సీరియస్ అయిన భారత్ ...ఇంకోసారి రిపీట్ అయితే బాగోదు అని పాక్ కు తీవ్ర హెచ్చరికలు

పాక్ పై సీరియస్ అయిన భారత్ ...ఇంకోసారి రిపీట్ అయితే బాగోదు అని పాక్ కు తీవ్ర హెచ్చరికలు

By: Sankar Sun, 15 Nov 2020 06:10 AM

పాక్ పై సీరియస్ అయిన భారత్ ...ఇంకోసారి రిపీట్ అయితే బాగోదు అని పాక్ కు తీవ్ర హెచ్చరికలు


రిహద్దుల్లో పాక్ కాల్పులపై భారత్ సీరియస్ అయ్యింది. ఢిల్లీలోని పాక్‌ దౌత్యాధికారికి సమన్లు జారీ చేసింది. పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం భారత్‌కు ఆగ్రహం తెప్పించింది.

మరోసారి ఇది రిపీట్‌ అయితే... దీటుగా జవాబు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని వార్నింగ్ ఇచ్చింది భారత్‌. పాక్‌ కవ్వింపులతో సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న పాకిస్థాన్‌ రేంజర్లు మన ఫార్వార్‌ పోస్టులు, జనావాసాలు లక్ష్యంగా పెద్ద ఎత్తున కాల్పులకు తెగపడ్డారు.

దీంతో ఐదుగురు భారత్‌ జవాన్లతో పాటు ఆరుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. పది మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పాక్‌ రేంజర్ల దుశ్చర్యకు భారత సైన్యం తగిన రీతిలో సమాధానం చెందింది. సరిహద్దు పొడవునా పాక్‌ రేంజర్లకు చెందిన ఫార్వార్డ్‌ పోస్టులతో పాటు బంకర్లు, చమురు నిల్వలు లక్ష్యంగా కాల్పులు జరిపారు భారత్‌ సైనికులు. ఇండియన్ ఆర్మీ దెబ్బకి 11 మంది పాక్‌ సైనికులు చనిపోయారు. వాస్తవాధీన రేఖ వద్ద కాల్పులు జరపడం ద్వారా భారత్‌ సైన్యం దృష్టి మరణించేందుకు ప్రయత్నించింది పాకిస్థాన్‌.

ఓ వైపు మన సైనికులు, జనవాసాలు లక్ష్యంగా కాల్పులు జరుపుతూ... ఈ హడావుడిలో ఉగ్రవాదుల్ని సరిహద్దు దాటించేకు ప్రయత్నించింది. అయితే... పాక్‌ దుష్టపన్నాగాన్ని ముందే పసిగట్టిన భారత్ సైన్యం... తగిన రీతిలో స్పందించింది. పాక్‌ సైనికుల బంకర్లతో పాటు ఉగ్రవాదుల శిక్షణ శిభిరాలపై రాకెట్ల వర్షం కురిపించింది. దీంతో పదకొండు మంది పాక్‌ సైనికులు హతమయ్యారు. అలాగే, ఉగ్రవాదుల చొరబోటు ప్రయత్నాలను కూడా సమర్థవంతంగా అడ్డుకోగలిగింది భారత్‌ సైన్యం.

Tags :
|
|
|

Advertisement