Advertisement

  • వైట్ వాష్ తప్పించుకుంటుందా ....నేడే టీమిండియా ఆస్ట్రేలియా మూడో వన్ డే

వైట్ వాష్ తప్పించుకుంటుందా ....నేడే టీమిండియా ఆస్ట్రేలియా మూడో వన్ డే

By: Sankar Wed, 02 Dec 2020 05:04 AM

వైట్ వాష్ తప్పించుకుంటుందా ....నేడే టీమిండియా ఆస్ట్రేలియా మూడో వన్ డే


ఆస్ట్రేలియా సిరీస్ లో వరుసగా రెండు ఒన్డే లు ఓడిపోయి సిరీస్ కోల్పోయిన టీమిండియా నేడు మూడో ఒన్డే లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది...ఈ మ్యాచ్ కూడా ఓడిపోతే టీమిండియా వైట్వాష్ అవుతుంది....మరోవైపు కీలక ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చిన ఆస్ట్రేలియా ఒత్తిడి లేకుండ బరిలోకి దిగుతుంది..

ఇక టీమిండియా తుది జట్టును చూసుకుంటే బాటింగ్ లో పెద్దగా మార్పులు అవసరం లేదు..అందరు బాగానే ఆడుతున్నప్పటికీ టార్గెట్ మరీ ఎక్కువగా ఉండటంతో బ్యాట్సమెన్ కూడా ఏమి చేయలేకపోతున్నారు..దీనితో ఈ ఒన్డే లో అయినా బౌలర్లు రాణించాలని టీమిండియా ఆశిస్తుంది..వరుసగా రెండు మ్యాచ్ లలో ధారాళంగా పరుగులు ఇచ్చిన చాహల్ , సైని స్థానంలో వేరే ఆటగాళ్లకు ఛాన్స్ ఇస్తుందా లేదా చూడాలి...ఇక పాండ్యా మళ్లీ బౌలింగ్‌ చేస్తుండటం జట్టుకు మేలు చేస్తుంది

ఆ్రస్టేలియా కోణంలో ఈ మ్యాచ్‌కు ప్రాధా న్యత లేదు. అయితే తప్పనిసరి పరిస్థితు ల్లోనే ఆ జట్టు రెండు మార్పులకు సిద్ధమవుతోంది. గాయపడిన వార్నర్, విశ్రాంతినిచ్చిన కమిన్స్‌ స్థానాల్లో ఇద్దరు ఆటగాళ్లు రానున్నారు. వార్నర్‌కు బదులుగా డార్సీ షార్ట్, మాథ్యూ వేడ్‌లలో ఒకరికి అవకాశం లభిస్తుంది. వికెట్‌ కీపరే అయినా స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మన్‌గా ఇటీవల వేడ్‌ దేశవాళీలో ఓపెనర్‌ పాత్రలో మంచి ప్రదర్శన కనబర్చాడు. ఇక దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న పేసర్‌ సీన్‌ అబాట్‌కు కమిన్స్‌ స్థానంలో చోటు ఖాయమైంది...

Tags :
|
|

Advertisement