Advertisement

  • నేడే రెండో టి ట్వంటీ ....సిరీస్ విజయమే లక్ష్యంగా టీమిండియా

నేడే రెండో టి ట్వంటీ ....సిరీస్ విజయమే లక్ష్యంగా టీమిండియా

By: Sankar Sun, 06 Dec 2020 06:55 AM

నేడే రెండో టి ట్వంటీ ....సిరీస్ విజయమే లక్ష్యంగా టీమిండియా


ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా తిరిగి విజయాల బాట పట్టింది..వన్ డే సిరీస్లో తొలి రెండు వన్ డే లలో ఓడిపోయి సిరీస్ కోల్పోయిన టీంఇండియా , ఆ తర్వాత మూడో వన్ డే , తొలి టి ట్వంటీ లలో విజయాలతో మల్లి గాడిలోపడింది..ఇక నేడు రెండో టి ట్వంటీ మ్యాచ్ల్లో ఫేవరేట్ గా బరిలోకి దిగనుంది...

వన్డే సిరీస్‌లో రాణించిన ధావన్, కెప్టెన్‌ కోహ్లి టి20 మ్యాచ్‌లో విఫలమయ్యారు. రెండో మ్యాచ్‌లో వీళ్లిద్దరు బ్యాట్‌ ఝుళిపిస్తే బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై పరుగుల వరద ఖాయం. ఫామ్‌లో ఉన్న ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌కు ఈ ఇద్దరు జతయితే భారత్‌ దర్జాగా ఓ మ్యాచ్‌ ఉండగానే సిరీస్‌ గెలుచుకుంటుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు.

మిడిలార్డర్‌లో మనీశ్‌ పాండే బ్యాటింగ్‌ గతి తప్పింది. దీంతో మార్పు చేయాలనుకుంటే శ్రేయస్‌ అయ్యర్‌కు అవకాశం లభించొచ్చు. కానీ వన్డేల్లో అయ్యర్‌ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. హార్దిక్‌ పాండ్యా గత మ్యాచ్‌లో తక్కువ పరుగులే చేసినా... అతని ఫామ్‌ ఆసీస్‌లో బాగుంది. ఇతను కూడా మెరిపిస్తే భారత్‌ స్కోరును నిలువరించడం ముమ్మాటికి అసాధ్యమే!

ఇక బౌలింగ్ విభాగంలో గత మ్యాచ్ లో సబ్స్టిట్యూట్ గా వచ్చిన చాహల్ సంచలనం బౌలింగ్ తో మూడు వికెట్లు తీయడంతో నేడు టి ట్వంటీ లో అతనికి చోటు కాయం ...ఇక అరంగేట్ర ఆటగాడు నటరాజన్ కూడా అద్భుతంగా రాణించాడు..అయితే తొలి టి ట్వంటీ లో రెస్ట్ తీసుకున్న బుమ్రా ఈ మ్యాచ్ల్లో బరిలోకి దిగుతాడా లేదో చూడాలి , ఇక కీలక ఆటగాడు , స్టార్ అల్ రౌండర్ జడేజా జట్టుకు దూరం కావడం పెద్ద లోటు అని చెప్పవచు

Tags :
|
|
|

Advertisement