Advertisement

  • ఫిఫా అండర్ -17 మరియు 2022లో ఏఎఫ్‌సీ ఉమెన్స్ ఆసియా కప్‌కు భారత్‌ ఆతిథ్యం

ఫిఫా అండర్ -17 మరియు 2022లో ఏఎఫ్‌సీ ఉమెన్స్ ఆసియా కప్‌కు భారత్‌ ఆతిథ్యం

By: chandrasekar Tue, 30 June 2020 5:52 PM

ఫిఫా అండర్ -17 మరియు 2022లో ఏఎఫ్‌సీ ఉమెన్స్ ఆసియా కప్‌కు భారత్‌ ఆతిథ్యం


భారత మహిళా ఫుట్ బాల్ జట్టులోని గోల్‌కీపర్‌ అదితి చౌహాన్ ఫిఫా అండర్ -17 మహిళల ప్రపంచ కప్ తర్వాత 2022లో ఏఎఫ్‌సీ ఉమెన్స్ ఆసియా కప్‌కు భారత్‌ ఆతిథ్యం ఇవ్వడం ద్వారా తమకు ద్వంద్వ ప్రయోజనం లభించనుందని పేర్కొన్నారు. ఫిఫా అండర్ -17 మహిళల ప్రపంచ కప్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనుంది. అలాగే, 2022 లో దేశం ఏఎఫ్‌సీ ఉమెన్స్ ఏషియన్ కప్ 2022కి ఆతిథ్యం ఇవ్వనుంది.

ఫిఫా అండర్ -17 ప్రపంచ కప్ ముగిసిన వెంటనే ఆసియా కప్ వస్తుంది. ఇది మాకు ద్వంద్వ ప్రయోజనం. ఇది చాలా గొప్ప వేదిక. ప్రతిఒక్కరూ ఉత్సాహంగా ఉన్నారు. ఫిట్‌నెస్‌పై దృష్టిసారిస్తున్నాం. మంచి డైట్‌ పాటిస్తున్నాం అని చౌహాన్‌ చెప్పినట్లు ఆల్ ఇండియా ఫుట్‌బాల్ సమాఖ్య అధికారిక వెబ్‌సైట్ ఏఐఎఫ్‌ఎఫ్‌ పేర్కొంది. ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద వేదిక. అందులోనూ మన దేశం ఆతిథ్యం ఇవ్వబోతున్నది. ఈ టోర్నీలు మాకెంతో ఉపయోగపడుతాయి. ప్రేక్షకులు, మీడియా, స్పాన్సర్లు ముందుకొచ్చి ఈ టోర్నీలను విజయవంతం చేయాలి అని అదితి చౌహాన్‌ వ్యాఖ్యానించారు.

భారత మహిళా జట్టులో ఇటీవల జరిగిన ఎక్స్‌పోజర్ టూర్ల గురించి ప్రస్తావిస్తూ, వారు జట్టులో చాలా పెద్ద మార్పు చేశారని అభిప్రాయపడ్డారు. తాము నిరంతరం ఆటతీరును మెరుగుపరుచుకుంటున్నామని, టఫ్‌ టీమ్‌లతో జరిగిన పోటీల్లో విజయం సాధించామని ఆమె పేర్కొన్నారు. జట్టులోని వారందరం ఒకరినొకరు బాగా అర్థంచేసుకున్నామని, క్రీడాస్ఫూర్తిని చాటుతున్నామని తెలిపారు. మహిళల ఆట చాలా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. అండర్ -17 ఉమెన్స్ వరల్డ్‌ కప్‌లో సత్తాచాటుతామని ఆమె ధీమా వ్యక్తంచేశారు.

Tags :
|
|
|

Advertisement