Advertisement

  • యూకే నుంచి వచ్చే విమానాలను రద్దు చేసిన ఇండియా

యూకే నుంచి వచ్చే విమానాలను రద్దు చేసిన ఇండియా

By: Sankar Mon, 21 Dec 2020 5:07 PM

యూకే నుంచి వచ్చే విమానాలను రద్దు చేసిన ఇండియా


బ్రిటన్‌లో కరోనా వైరస్ స్ట్రెయిన్ ప్రభావంతో భారత్-బ్రిటన్‌ల మధ్య విమాన సర్వీసులను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విమానాల రద్దును రేపు అర్ధరాత్రి నుంచి అమలు చేయనుంది. డిసెంబర్‌ 31 వరకు ఈ నిషేధం కొనసాగనుంది. బ్రిటన్‌ నుంచి భారత్ వచ్చిన వారికి వారం రోజులు క్వారంటైన్ విధించనుంది.

కాగా బ్రిట‌న్‌లో వెలుగు చూసిన ఈ కొత్త ర‌కం క‌రోనా వైర‌స్ మ‌ళ్లీ వ‌ణుకు పుట్టిస్తోంది. ఈ కొత్త వైరస్‌ కరోనా వైరస్‌ కంటే వేగంగా వ్యాపిస్తోంది. దీనివ‌ల్ల బ్రిట‌న్‌లో ప‌రిస్థితి చేయి దాటి పోవడంతో లండ‌న్‌తోపాటు ఆగ్నేయ ఇంగ్లండ్‌లో ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. కరోనా వ్యాక్సిన్ దేశమంతా సప్లై అయ్యే వరకూ కొన్ని నెలలపాటూ నిబంధనలు కొనసాగుతాయని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆదేశించారు . క్రిస్‌మస్‌ సంబ‌రాల‌ను సైతం ర‌ద్దు చేస్తూ ఇంట్లోనే ఉండాలని సూచించారు.

ఇక బ్రిటన్‌ నుంచే వ‌చ్చే విమానాల‌పై నిషేధం విధించాలని ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అర‌వింద్ కేజ్రీవాల్ కేంద్రాన్ని కోరారు. బ్రిటన్‌లో వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ కొత్త మ్యుటేషన్ సూపర్ స్ప్రెడర్‌లా ఉందని సోమవారం (డిసెంబర్ 21) ఆయన ట్వీట్ చేశారు. త‌క్షణమే ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని కేజ్రీవాల్ కోరిన విషయం తెలిసిందే

Tags :
|
|

Advertisement