Advertisement

  • భారత్ - శ్రీలంక సంయుక్త౦గా నావికా దళ విన్యాసాలు...

భారత్ - శ్రీలంక సంయుక్త౦గా నావికా దళ విన్యాసాలు...

By: chandrasekar Tue, 20 Oct 2020 5:57 PM

భారత్ - శ్రీలంక సంయుక్త౦గా నావికా దళ విన్యాసాలు...


‌భార‌త నావికా ద‌ళం (ఐఎన్‌) - శ్రీ‌లంక నావికాద‌ళం (ఎస్ఎల్ఎన్‌)సంయుక్తాధ్వర్యంలో 8వ ఎడిషన్ నౌకద‌ళ విన్యాసాలు శ్రీ‌లంక‌లోని ట్రింకోమ‌లీలో ప్రారంభమయ్యాయి. 21వ‌ తేదీ వ‌ర‌కు స్లినెక్స్‌-20 పేరుతో విన్యాసాలు ప్రదర్శించబడతాయి.

శ్రీ‌లంక దేశం త‌ర‌పున ఆ దేశ‌ నావికా దళానికి చెందిన ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ నావల్ ఫ్లీట్ రేర్ అడ్మిరల్ బండారా జయతిలకా నేతృత్వంలోని ఎస్‌ఎల్‌ఎన్ నౌక సయూరా, గజబాహు ఈ విన్యాసాల‌లో ప్రాతినిధ్యం వహించ‌నున్నాయి.

దేశీయంగా నిర్మించిన ఎఎస్‌డబ్ల్యు కొర్వెట్ట‌స్ కమోర్తా, కిల్తానందర్‌తో స‌హా ఈశాన్య ఫ్లీట్‌ కమాండింగ్ ఫ్లాగ్ ఆఫీసర్ రియర్ అడ్మిరల్ సంజయ్ వాత్సాయన్‌లు భారత దళానికి ఈ విన్యాసాల‌లో ప్రాతినిధ్యం వహించ‌నున్నారు. దీనికి తోడు ఆయా నౌక‌ల్లో ఏర్పాటు చేసిన భార‌త‌ నేవీ 'అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్‌‌' (ఏఎల్‌హెచ్), చేత‌క్ హెలికాప్టర్ ఆన్‌బోర్డ్ ఇన్‌షిప్‌ల‌తో స‌హా ఈ విన్యాసాల‌లో భాగం అవనున్నాయి.

వీటితో పాటుగా మారిటైమ్ పెట్రోల్ ఎయిర్ ‌క్రాఫ్ట్ డోర్నియర్ కూడా ఈ విన్యాసాల్లో పాల్గొననుంది. గ‌త ఏడాది (2019లో) స్లినెక్స్-19 నావికా ద‌ళ విన్యాసాలు విశాఖ‌ప‌ట్నం న‌గ‌రంలో నిర్వ‌హించారు.

Tags :
|
|
|

Advertisement