Advertisement

  • గులాబీ బంతి పోరులో తొలి రోజు ముగిసే సరికి టీమిండియా 233 /6

గులాబీ బంతి పోరులో తొలి రోజు ముగిసే సరికి టీమిండియా 233 /6

By: Sankar Thu, 17 Dec 2020 5:32 PM

గులాబీ బంతి పోరులో తొలి రోజు ముగిసే సరికి టీమిండియా 233 /6


అడిలైడ్ వేదిక ఆస్ట్రేలియా ఇండియా జట్ల మధ్య జరుగుతున్న పింక్ టెస్ట్ లో తొలి రోజు ముగిసింది ..తొలి రోజులో రెండు జట్లు నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి ..అయితే చివరి సెషన్ లో వరుస వికెట్లు తీసి ఆస్ట్రేలియా తొలి రోజులో ఆధిక్యంలో నిలిచింది.మొదటి రోజు ముగిసే సమయానికి భారత్ 233 పరుగులు చేసి 6 వికెట్లు కోల్పోయింది..

తొలుత టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు ..అయితే తొలి ఓవర్లోనే స్టార్క్ బౌలింగ్ లో పృథ్వీ షా పేలవ షాట్ తో బౌల్డ్ అయ్యాడు .దీనితో కాత తెరవకుండానే ఇండియా తొలి వికెట్ కోల్పోయింది.. కాసేపటికే మరో ఓపెనర్ మయాంక్(17) ను పెవిలియన్ కు చేర్చారు. దాంతో భారత్ 32 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఇక ఆ తర్వాత పుజారా, కోహ్లీ కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిదే ప్రయత్నం చేసారు.

వీరి 78 పరుగుల భాగసౌమ్యం వద్ద పుజారా(43) క్యాచ్ రూపంలో వెనుదిరిగాడు. ఆ తర్వాత కూడా తన దూకుడు తగ్గించని కోహ్లీ అర్ధశతకం పూర్తి చేసాడు. కానీ 74 పరుగుల వద్త రహానే రాంగ్ కాల్ కు కోహ్లీ రన్ ఔట్ అయ్యాడు. అయితే అప్పటికే 80 ఓవర్లు పూర్తి చేసిన ఆసీస్ కొత్త బంతిని తీసుకొని రహానే(42), విహారి(16) లను పెవిలియన్ కు చేర్చారు. ఇక ప్రస్తుతం సాహా(9), అశ్విన్(15) వద్ద బ్యాటింగ్ చేస్తుండగా మొదటి రోజు ముగిసింది. అయితే ఆసీస్ బౌలర్లలో స్టార్క్ రెండు వికెట్లు తీసుకోగా జోష్ హాజిల్‌వుడ్, కమ్మిన్స్, నాథన్ లియోన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

Tags :
|
|
|

Advertisement