Advertisement

చైనా ఈ ఉద్రిక్తతలకు కారణం భారత్ అంటోంది

By: chandrasekar Wed, 17 June 2020 2:36 PM

చైనా ఈ ఉద్రిక్తతలకు కారణం భారత్ అంటోంది


భారత్, చైనా మధ్య సరిహద్దుల్లో గత కొన్ని వారాల నుంచీ పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది. వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) దగ్గర రెండు దేశాలు తమ సైన్యం మోహరింపు పెంచుతున్నాయి.

అక్సాయి చీన్‌లో ఉన్న గల్వాన్ లోయ గురించి రెండు దేశాల మధ్య ఈ ఉద్రిక్తతలు మొదలయ్యాయి. గల్వాన్ లోయ తీరంలో చైనా సైన్యం కొన్ని టెంట్స్ కనిపించాయి. ఆ తర్వాత భారత్ కూడా అక్కడ తన సైన్యం మోహరింపు పెంచింది. చైనా మాత్రం, గల్వాన్ లోయ దగ్గర భారత్ రక్షణ సంబంధిత అక్రమ నిర్మాణాలు చేపడుతోందని ఆరోపిస్తోంది.

మేలో రెండు దేశాల సరిహద్దుల్లో వివిధ ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. మే 9న నార్త్ సిక్కిం నాకూలా సెక్టార్‌లో భారత్, చైనా సైనికుల మధ్య గొడవ జరిగింది. అదే సమయంలో లద్దాఖ్‌లో ఎల్ఏసీ దగ్గర చైనా ఆర్మీ హెలికాప్టర్లు కనిపించాయి. ఆ తర్వాత భారత వైమానికదళం కూడా సుఖోయ్ సహా మితా యుద్ధ విమానాలతో గస్తీ ప్రారంభించింది.

మేలో రెండు దేశాల సరిహద్దుల్లో వివిధ ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. మే 9న నార్త్ సిక్కిం నాకూలా సెక్టార్‌లో భారత్, చైనా సైనికుల మధ్య గొడవ జరిగింది. అదే సమయంలో లద్దాఖ్‌లో ఎల్ఏసీ దగ్గర చైనా ఆర్మీ హెలికాప్టర్లు కనిపించాయి. ఆ తర్వాత భారత వైమానికదళం కూడా సుఖోయ్ సహా మితా యుద్ధ విమానాలతో గస్తీ ప్రారంభించింది.

సోమవారం వైమానిక దళ చీఫ్ ఆర్కేఎస్ భదౌరియా కూడా చైనా గురించి మాట్లాడారు. “అక్కడ కొన్ని అసాధారణ కార్యకలాపాలు కనిపించాయి. అలాంటి ఘటనలపై మేం నిశితంగా నిఘాపెడతాం. తగిన చర్యలు కూడా తీసుకుంటాం. అలాంటి వాటి గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు” అన్నారు.

india says,china,cause,of these tensions,soilders ,చైనా, ఈ ఉద్రిక్తతలకు, కారణం ,భారత్ ,అంటోంది


రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల గురించి గత వారం మాట్లాడిన పదాతిదళం చీఫ్ జనరల్ ఎంఎం నరవణే “చైనాతో ఉన్న సరిహద్దుల్లో భారత దళాలు తమ ‘స్థితి’లో ఉన్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయి” అని చెప్పారు. ఈ గొడవల్లో ఇరు దేశాల సైనికులూ దూకుడుగా ప్రవర్తించారు. అందుకే వారికి స్వల్ప గాయాలయ్యాయి అని కూడా ఆయన చెప్పారు. చైనా ఈ ఉద్రిక్తతలకు కారణం భారత్ అంటోంది. చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబల్ టైమ్స్ సోమవారం ప్రచురించిన ఒక కథనంలో గాల్వన్ నది(లోయ) ప్రాంతంలో ఉద్రిక్తతలకు కారణం భారత్ అని రాసింది.

చైనా సైన్యం వివరాలుగా చెబుతూ ఆ పత్రిక “భారత్ ఈ ప్రాంతంలో రక్షణ సంబంధిత అక్రమ కట్టడాలు నిర్మిస్తోంది. అందు వల్ల చైనా అక్కడ సైన్యం మోహరింపు పెంచింది. ఈ ఉద్రిక్తతలను భారత్ మొదలుపెట్టింది. కానీ, అక్కడ 2017లో డోక్లాం లాంటి పరిస్థితులు ఏర్పడవు అని మాకు నమ్మకం ఉంది. భారత్ కోవిడ్-19 వల్ల ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతోంది. దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి అది గాల్వన్ ఉద్రిక్తతలు సృష్టించింది” అని రాశారు.

గ్లోబల్ టైమ్స్ గాల్వన్ లోయ చైనా ప్రాంతం అని కూడా రాసింది. భారత్ చేపట్టినవి సరిహద్దు అంశాల్లో భారత్, చైనా మధ్య జరిగిన ఒప్పందాల ఉల్లంఘనే అని పేర్కొంది. మే ప్రారంభం నుంచీ భారత్ గాల్వన్ లోయ దగ్గర సరిహద్దు దాటుతోంది. చైనా భూభాగంలోకి చొచ్చుకొస్తోంది చెప్పింది.

వివాదిత గాల్వన్ లోయ ప్రాంతం అక్సాయి చీన్‌లో ఉంది. ఈ లోయ లద్దాఖ్, అక్సాయి చీన్ మధ్య భారత-చైనా సరిహద్దులకు దగ్గరగా ఉంది. ఇక్కడ వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్ఏసీ) అక్సాయి చీన్‌ను భారత్ నుంచి వేరు చేస్తుంది. అక్సాయి చీన్‌ మాదని భారత్, చైనా రెండూ వాదిస్తున్నాయి. చైనా దక్షిణ షింజియాంగ్, భారత్ లద్దాఖ్‌లో ఈ లోయ వ్యాపించి ఉంది.

జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్, అంతర్జాతీయ అంశాల నిపుణుడు ఎస్డీ ముని “ఈ ప్రాంతం భారత్‌కు వ్యూహాత్మకంగా చాలా కీలకం. ఎందుకంటే ఇది పాకిస్తాన్, చైనా షింజియాంగ్, లద్దాఖ్ సరిహద్దులతో కలిసి ఉంది. 1962 యుద్ధం జరిగినప్పుడు గాల్వన్ నది దగ్గర ఈ ప్రాంతం యుద్ధానికి ప్రధాన కేంద్రంగా మారింది” అన్నారు.

Tags :
|
|

Advertisement