Advertisement

  • ఉద్రిక్త‌త‌ల‌కు పూర్తి బాధ్య‌త ఇండియాదే: చైనా విదేశాంగ శాఖ

ఉద్రిక్త‌త‌ల‌కు పూర్తి బాధ్య‌త ఇండియాదే: చైనా విదేశాంగ శాఖ

By: chandrasekar Sat, 12 Dec 2020 11:36 AM

ఉద్రిక్త‌త‌ల‌కు పూర్తి బాధ్య‌త ఇండియాదే: చైనా విదేశాంగ శాఖ


భారత్ మరియు చైనా వాస్తవాధీన రేఖ వెంబడి చైనా తమ బలగాలను అధిక సంఖ్యలో మొహరిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై పలు దఫాలు చర్చలు జరిపిన కూడా చైనా తమ బలగాలను వెనుకకు తీసుకోలేదు. అందువల్ల మన విదేశాంగ మంత్రి జైశంక‌ర్ చైనా పై ఆరోపణలు చేశారు. ఇందుకు గాను వాస్తవాధీన రేఖ వెంబ‌డి ప్ర‌స్తుతం నెల‌కొన్న ఉద్రిక్త వాతావరణానికి పూర్తిగా ఇండియానే కార‌ణ‌మ‌ని చైనా ప్రతి ఆరోపణ చేస్తూవుంది. స‌రిహ‌ద్దులో పెద్ద సంఖ్య‌లో బ‌ల‌గాల‌ను మోహ‌రించి చైనా ఒప్పందాల‌ను తుంగ‌లో తొక్కింద‌ని విదేశాంగ మంత్రి జైశంక‌ర్ ఆరోప‌ణ‌ల‌పై చైనా ప్రతి స్పందన ఇలా తెలిపింది. ఇటీవల వారి బలగాల వెనుకకు తగ్గక పోవడంతో చైనాతో సంబంధాలు పూర్తిగా క్షీణించాయ‌ని ఆయ‌న చెప్పిన విష‌యం తెలిసిందే. దీనిపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్ర‌తినిధి హువా చున్యింగ్ జైశంకర్ వ్యాఖ్యలపై స్పందించారు. ప్ర‌స్తుతం వాస్త‌వాధీన రేఖ వెంబ‌డి ఉద్రిక్త‌త‌ల‌కు పూర్తి బాధ్య‌త ఇండియాదే అని ఆమె ఆరోపించారు.

చైనా గత కొంత కాలంగా భూ అపహరణకు ప్రయత్నిస్తున్నది. దీనికి భారత్ ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా మన సైన్యాన్ని చైనా కు దీటుగా మోహరించింది. చైనా ప్రతినిధి మాట్లాడుతూ ప్ర‌పంచంలోనే రెండు పెద్ద అభివృద్ధి చెందుతున్న దేశాలు పొరుగు దేశాలుగా ఉన్నాయి అని తెలిపారు. రెండు దేశాల మ‌ధ్య మంచి సంబంధాలు ఉండ‌టం అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు నెల‌కొన్న ప‌రిస్థితుల‌కు పూర్తి బాధ్య‌త వ‌హించాల్సింది ఇండియానే. చైనా ఒప్పందాల‌కు క‌ట్టుబ‌డి ఉందని చర్చ‌ల‌తోనే స‌మ‌స్య‌కు ప‌రిష్కారం కోసం ప్ర‌య‌త్నిస్తోందని చెప్పింది. స‌రిహ‌ద్దు వెంబ‌డి శాంతి, సామ‌రస్యం నెల‌కొనాల‌ని కోరుకుంటున్నా మా భూభాగాన్ని కాపాడుకోవ‌డం కూడా ముఖ్య‌మే అని ఆమె తెలిపారు. ఇక్కడ రెండు దేశాల అభివృద్ది కోసం ఇండియా త‌మ‌తో క‌లిసి న‌డుస్తుంద‌న్న ఆశాభావాన్ని చున్యింగ్ వ్య‌క్తం చేశారు. ప్ర‌స్తుతం ద్వైపాక్షిక సంబంధాల్లో కొన్ని స‌వాళ్లు ఉన్నప్పటికీ ఇండియా విష‌యంలో త‌మ వైఖ‌రి మార‌లేద‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. రెండు దేశాల ప్ర‌యోజ‌నాల కోసం మెరుగైన సంబంధాలు నెల‌కొన‌డం అవ‌స‌ర‌మ‌ని ఆమె అభిప్రాయ‌ప‌డ్డారు. చైనా తమ బలగాలను ఏమాత్రం తగ్గించ కుండా పెంచుతూ పోతు వుంది. దీనివల్ల ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Tags :
|

Advertisement