Advertisement

  • కెనడా ప్రధాని వ్యాఖ్యలపైఅభ్యంతరం వ్యక్తం చేసిన భారత్

కెనడా ప్రధాని వ్యాఖ్యలపైఅభ్యంతరం వ్యక్తం చేసిన భారత్

By: Sankar Tue, 01 Dec 2020 11:12 PM

కెనడా ప్రధాని వ్యాఖ్యలపైఅభ్యంతరం వ్యక్తం చేసిన భారత్


భారత్‌లో కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేపడుతున్న రైతుల విషయంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించడం పట్ల భారత ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది.

అరకొర సమాచారం ఆధారంగా చేస్తున్న వ్యాఖ్యలు పూర్తిగా అనవసరమని స్పష్టం చేసింది. మీడియా సమావేశంలో పాత్రికేయులు కెనడా ప్రధాని ప్రస్తావన తేగా..విదేశంగశాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ ఈ మేరకు స్పందించారు. ‘అరకొర సమాచారంతో కెనడాకు నేతలు భారత్‌లోని రైతు నిరసనలపై స్పందించడం మనం చూశాం.

అయితే ఇటువంటి వ్యాఖ్యలు..అది కూడా భారత్ అంతర్గత విషయాలపై చేయడం సమంజసం కాదు. అంతేకాకుండా.. దౌత్యపరమైన అంశాలపై చేసిన వ్యాఖ్యలకు రాజకీయావసరాల కోసం తప్పుడు నిర్వచనాలు ఇవ్వడం సబబు కాదు’ అని అనురాగ్ శ్రీవాత్సవ కామెంట్ చేశారు.

Tags :
|

Advertisement