Advertisement

  • దేశంలో తగ్గని కరోనా ..వరుసగా నాలుగోరోజు 62 వేలకు పైగా కేసులు నమోదు

దేశంలో తగ్గని కరోనా ..వరుసగా నాలుగోరోజు 62 వేలకు పైగా కేసులు నమోదు

By: Sankar Mon, 10 Aug 2020 1:25 PM

దేశంలో తగ్గని కరోనా ..వరుసగా నాలుగోరోజు 62 వేలకు పైగా కేసులు నమోదు



దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. వరుసగా నాలుగో రోజూ 62 వేలకు పైగా కోవిడ్‌-19 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 62,064 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం హెల్త్ బులెటిన్‌ విడుదల చేసింది.

దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 22,15,075కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 15,35,744 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,007 మంది కరోనాతో మృతి చెందారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం 44,386 మంది కరోనాతో మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 6,34,945 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి

కాగా ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు ఉన్న అమెరికా , బ్రెజిల్ ల కంటే ఇండియాలోనే అత్యధిక కేసులు నమోదు అవుతుండటం ఆందోళన రేకెత్తిస్తుంది ..పాజిటివ్‌ కేసుల పెరుగుదలలో అమెరికా, బ్రెజిల్‌లను వెనక్కి నెట్టి అత్యంత వేగంగా 2 మిలియన్‌ కేసుల దిశగా పరుగులు తీసింది.. ఈ రెండు దేశాల(అమెరికా-43, బ్రెజిల్‌-27)తో పోలిస్తే అతితక్కువ సమయంలోనే (21 రోజులు) 20 లక్షల మార్కును చేరుకుంది. మొదటి దశలో మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీల్లో తీవ్ర స్థాయిలో కరోనా ప్రభావం చూపగా.. రెండో దశలో ఏపీ, కర్ణాటక, యూపీ తదితర రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య పెరిగింది. అయితే కరోనా నిర్దారణ పరీక్షల సంఖ్య గణనీయంగా పెరగడం ఈ సంఖ్యపై ప్రభావం చూపిందని చెప్పవచ్చు.

Tags :
|
|

Advertisement