Advertisement

  • దేశంలో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు ..1209 కొత్త మరణాలు

దేశంలో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు ..1209 కొత్త మరణాలు

By: Sankar Fri, 11 Sept 2020 10:19 AM

దేశంలో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు ..1209 కొత్త మరణాలు


భారత్‌లో కరోనా మహమ్మారి విశ్వరూపం చూపిస్తోంది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 96, 551 కేసులు బయటపడ్డాయి. ఇప్పటి వరకూ ఒకే రోజులో అత్యధిక కేసుల సంఖ్య ఇదే కావడం గమనార్హం. దీంతో మొత్తం కేసుల సంఖ్య 45,62,415 కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 1209 మంది మరణించగా.. మొత్తం మరణాల సంఖ్య 76,271 కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 35,42,664 కు చేరుకోగా, యాక్టివ్‌ కేసుల సంఖ్య 9,43,480 గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 20.58 శాతం ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు 77.94 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.67 శాతానికి పడిపోయిందని తెలిపింది.

ఇక తెలంగాణాలో గత 24 గంటల్లో కొత్తగా 2,426 మందికి కరోనా సోకగా.. 13 మంది మృతి చెందినట్లు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,52,602కు చేరింది. గడిచిన 24 గంటల్లో 2,324 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 1,19,467కు పెరిగింది

Tags :
|
|

Advertisement