Advertisement

  • దేశంలో భారీగా కరోనా కేసులు ...తాజాగా 1133 మంది మృతి

దేశంలో భారీగా కరోనా కేసులు ...తాజాగా 1133 మంది మృతి

By: Sankar Sun, 20 Sept 2020 11:06 AM

దేశంలో భారీగా కరోనా కేసులు ...తాజాగా 1133 మంది మృతి


భార‌త్‌తో క‌రోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 92,605 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం బాధితుల‌సంఖ్య 54,00,620 చేరింది. అయితే రిక‌వ‌రీ రేటు సైతం భారీగానే న‌మోద‌వుతుంది. గడిచిన 24 గంటల్లో 1,133 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 86,752కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది..

ఇక, గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కరోనా బారినపడి కోలుకున్నవారి సంఖ్య 94,612గా ఉందని కేంద్రం పేర్కొంది.. అంటే.. పాజిటివ్ కేసుల కంటే.. రికవరీ కేసులు పెరిగిపోయాయి. మరోవైపు దేశంలో యాక్టివ్‌ కేసులే 10 లక్షల మార్క్‌ను క్రాస్ చేశాయి... కరోనా బులెటిన్‌ ప్రకారం ప్రస్తుతం 10,10,824 యాక్టివ్ కేసులు ఉన్నాయి..

ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 43,03,043గా ఉండగా.. దేశంలో రికవరీ రేటు 79.28 శాతానికి పెరిగిందని.. మరణాల రేటు 1.61 శాతానికి తగ్గిపోయిందని ప్రభుత్వం పేర్కొంది. గడచిన 24 గంటల్లో 12,06,806 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. దేశంలో ఇప్పటి వరకు 6,36,61,060 కోట్ల టెస్ట్‌లు చేసినట్టు ఐసీఎంఆర్‌ ప్రకటించింది..

Tags :
|
|

Advertisement