Advertisement

  • ఏ మాత్రం కనికరం చూపని కరోనా ..దేశంలో తాజాగా 1136 మరణాలు నమోదు

ఏ మాత్రం కనికరం చూపని కరోనా ..దేశంలో తాజాగా 1136 మరణాలు నమోదు

By: Sankar Mon, 14 Sept 2020 11:28 AM

ఏ మాత్రం కనికరం చూపని కరోనా ..దేశంలో తాజాగా 1136 మరణాలు నమోదు


దేశంలో కరోనా కేసులు తీవ్రస్థాయిలో నమోదు అయితునే ఉన్నాయి..గత కొన్ని రోజులుగా 90 వేలకు తగ్గకుండా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తుంది..తాజాగా గడిచిన 24 గంటల్లో 92,071 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది.

దీంతో కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు 48లక్షల మార్క్‌ను దాటింది. దేశంలో కేసుల సంఖ్య 48,46,428కు చేరాయని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం 9,86,598 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, 37,80,108 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారని మంత్రిత్వశాఖ తెలిపింది. వైరస్‌ ప్రభావంతో గడిచిన 24గంటల్లో మరో 1,136 మంది మరణించగా.. ఇప్పటి వరకు 79,722 మంది మృత్యువాతపడ్డారని వివరించింది.

ఇదిలా ఉండగా.. ఆదివారం 9,78,500 టెస్టులు చేసినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) పేర్కొంది. ఇప్పటి వరకు 5,72,39,428 శాంపిల్స్‌ పరీక్షించినట్లు వివరించింది.అయితే దేశంలో కరోనా వ్యాక్సిన్ మీద ప్రయోగాలు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి..కేంద్ర ఆరోగ్య మంత్రి మాట్లాడుతూ వచ్చే ఏడాది మొదటి భాగంలో కరోనా కు వ్యాక్సిన్ వస్తుది అని అన్నారు..

Tags :
|
|

Advertisement