Advertisement

  • దేశంలో కొత్తగా 86 వేలకు పైగా కరోనా కేసులు...లక్షకు చేరువలో మొత్తం కరోనా మృతులు

దేశంలో కొత్తగా 86 వేలకు పైగా కరోనా కేసులు...లక్షకు చేరువలో మొత్తం కరోనా మృతులు

By: Sankar Thu, 01 Oct 2020 11:09 AM

దేశంలో కొత్తగా 86 వేలకు పైగా కరోనా కేసులు...లక్షకు చేరువలో మొత్తం కరోనా మృతులు


దేశంలో కరోనా ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న పాజిటివ్‌ కేసులు మళ్లీ పెరిగాయి. నిన్న 80 వేల కేసులు నమోదవగా, తాజాగా 86 వేలకుపైగా పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసులు 63 లక్షలు దాటాయి. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 86,821 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 63,12,585కు చేరింది. ఇందులో 9,40,705 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 52,73,201 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు. నిన్న ఉదయం నుంచి ఈరోజు ఉదయం వరకు 1181 మంది కరోనా వల్ల మరణించారు. దీంతో కరోనా మృతులు 98,678కి చేరారు. అయితే ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో పాజిటివ్‌ కేసులు 15.11 శాతంగా ఉండగా, రికవరీ రేటు 83.33 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది.

దేశంలో నిన్న ఒక్కరోజే 14,23,052 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్‌) ప్రకటించింది. దీంతో సెప్టెంబర్‌ 30 వరకు మొత్తం 7,56,19,781 నమూనాలను పరీక్షించామని తెలిపింది.

Tags :
|
|

Advertisement