Advertisement

  • బ్రేకింగ్ న్యూస్ ..ఇండియాలో కొత్త కరోనా స్ట్రెయిన్ వైరస్

బ్రేకింగ్ న్యూస్ ..ఇండియాలో కొత్త కరోనా స్ట్రెయిన్ వైరస్

By: Sankar Tue, 29 Dec 2020 10:25 AM

బ్రేకింగ్ న్యూస్ ..ఇండియాలో కొత్త కరోనా స్ట్రెయిన్ వైరస్


బ్రిటన్ లో తీవ్ర స్థాయిలో విజృంబిస్తు ప్రపంచ దేశాలకు పాకుతున్న కరోనా కొత్త వైరస్ స్ట్రెయిన్ ఇండియాలోకి కూడా అడుగుపెట్టింది..బ్రిటన్ లో కరోనా విజృంభించిన వెంటనే ఇండియా కూడా అప్రమత్తం అయినా కూడా కొత్త వైరస్ ఇండియాలోకి ప్రవేశించింది...

ఈ నెలలో యూకే, యూకే మీదుగా భారత్‌కు వచ్చినవారిని గుర్తించిన కోవిడ్ టెస్ట్‌లు నిర్వహించారు.. ఇక, వీరిలో కోవిడ్ పాజిటివ్‌గా తేలినివారిని ఐసోలేషన్‌కు తరలించారు.. వారికి అత్యంత సన్నిహితంగా మెలిగినవారికి సైతం టెస్టులు నిర్వహించిన క్వారంటైన్‌లో పెట్టారు. మరోవైపు.. పాజిటివ్‌గా తేలినవారి శాంపిల్స్ అటు పుణెకు, ఇటు హైదరాబాద్‌లోని సీసీఎంబీకి తరలించారు.

మొన్నే రిపోర్టులు వచ్చాని.. గోప్యంగా ఉంటాయి రాష్ట్రాలు.. ఆ నివేదికలను కేంద్ర ఆరోగ్యశాఖకు పపంపించాయి. మొతంగా ఇవాళ కొత్త కరోనా స్ట్రెయిన్ కేసులను ప్రకటించింది భారత ఆరోగ్యశాఖ... దేశ వ్యాప్తంగా ఇప్పటికే ఆరు కేసులు నమోదయినట్టు అధికారులు గుర్తించారు. బెంగళూరులో మూడు, హైదరాబాద్‌లో రెండు కేసులు నమోదు కాగా.. పుణెలో ఒక కేసులు వెలుగు చూసినట్టు కేంద్రం ప్రకటించింది.

Tags :
|
|

Advertisement