Advertisement

  • నెలన్నరలోనే ఇండియా లో ఆరు లక్షల కరోనా కేసులు నమోదు ..

నెలన్నరలోనే ఇండియా లో ఆరు లక్షల కరోనా కేసులు నమోదు ..

By: Sankar Tue, 07 July 2020 5:56 PM

నెలన్నరలోనే ఇండియా లో ఆరు లక్షల కరోనా కేసులు నమోదు ..



దేశంలో కరోనా స్థితిని లాక్ డౌన్ ఎత్తివేయడానికి ముందు , ఎత్తి వేసిన తర్వాత అని విభజించవచ్చు ..లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఎవ్వరు బయటకు రాకపోవడంతో కరోనా తన ప్రభావాన్ని చూయించలేకపోయింది ..అయితే దేశంలో ఒక్కసారిగా లాక్ డౌన్ లో సడలింపులు ఇవ్వడం మొదలు పెట్టిన తర్వాత కరోనా కేసులు మెల్ల మెల్లగా పెరగడం ప్రారంభించి ఇప్పుడు తీవ్ర రూపం దాల్చాయి ..

ప్రస్తుతం ప్రతి రోజు వేలల్లో పెరుగుతున్న కేసులతో ప్రపంచంలోనే అత్యధిక కేసులున్న దేశాల జాబితాలో మూడో స్థానానికి భారత్ ఎగబాకింది. కేసులు పెరుగుతున్నా దేశంలో రికవరీ కూడా అదే స్థాయిలో పెరుగుతుండడం కొంత ఊరటనిచ్చే అంశం. దేశంలో రికవరీ రేటు 61.13 శాతంగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. కరోనా వైరస్ పరీక్ష ల్యాబ్‌లను పెంచుకుంటూ పోతున్నామని, ప్రస్తుతం 1,115 ల్యాబ్‌లు అందుబాటులోకి వచ్చాయని తెలిపింది. మొత్తం 10 మిలియన్ మందికి పరీక్షలు నిర్వహించినట్టు పేర్కొంది.

దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 4,39,947 మంది కోలుకున్నారని, యాక్టివ్ కేసుల కంటే 1,80,390 మంది ఎక్కువగా కోలుకున్నారని వివరించింది. ఫలితంగా రికవరీ రేటు 61.13 శాతానికి పెరిగినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. గత 24 గంటల్లో 467 మంది కోవిడ్ కారణంగా మృతి చెందగా, మొత్తం మరణాల సంఖ్య 20 వేలు దాటిపోయింది. అలాగే, దేశంలో వరుసగా ఐదో రోజు కూడా 20 వేలకు పైగా కేసులు నమోదు కావడం గమనార్హం. దేశంలో లక్ష కేసులు నమోదు కావడానికి 110 రోజులు పట్టగా, ఆ తర్వాత 49 రోజులకే దేశంలో నమోదైన కేసుల సంఖ్య 7 లక్షలకు చేరుకోవడాన్ని బట్టి చూస్తే వైరస్ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతోందో అర్థం చేసుకోవచ్చు.


Tags :
|
|
|
|

Advertisement