Advertisement

  • దేశంలో అరవై వేల మార్క్ దిశగా దూసుకుపోతున్న ఒక్క రోజు కరోనా కేసులు..తాజాగా 57117 నమోదు

దేశంలో అరవై వేల మార్క్ దిశగా దూసుకుపోతున్న ఒక్క రోజు కరోనా కేసులు..తాజాగా 57117 నమోదు

By: Sankar Sat, 01 Aug 2020 2:27 PM

దేశంలో అరవై వేల మార్క్ దిశగా దూసుకుపోతున్న ఒక్క రోజు కరోనా కేసులు..తాజాగా 57117 నమోదు



భారత్‌లో కరోనా వైరస్ కేసులు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. రోజూ కేసుల సంఖ్య 50 వేల మార్క్ దాట‌డం సాధార‌ణమైన విష‌యంగా మారింది. గ‌డిచిన 24 గంట‌ల్లో మ‌రోసారి రికార్డ్ స్థాయిలో కేసులు న‌మోద‌య్యాయి. శుక్రవారం ఒక్క రోజే అత్యధికంగా 57,117 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఒకే రోజులో అత్యధిక కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.

తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 16,95,988కి చేరింది. ఈ మేరకు శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేసింది. కరోనా బారిన పడి గడిచిన 24 గంటల్లో 764 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 36,5112కు చేరింది.

ఇక గత 24 గంటల్లో 36,569 మంది కోవిడ్‌ నుంచి కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తంగా 10,94,374 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశ వ్యాపంగా రికవరీ రేటు 64.3శాతంగా ఉంది. దేశంలో ప్రస్తుతం 5,65,103 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ప్ర‌స్తుతం మ‌హారాష్ట్ర‌, త‌మిళ‌నాడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఢిల్లీల్లో అత్య‌ధిక క‌రోనా కేసులు నమోదవుతున్నాయి.

Tags :
|
|

Advertisement