Advertisement

  • దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు ..కొత్తగా 53,601 నమోదు

దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు ..కొత్తగా 53,601 నమోదు

By: Sankar Tue, 11 Aug 2020 10:27 AM

దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు ..కొత్తగా 53,601 నమోదు



భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. పాజిటివ్ కేసులు, మరణాలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 53,601 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 871మరణాలు సంభవించాయి. దీంతో మొత్తంగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 22,68,675కి చేరింది. ఇప్పటి వరకు 45,257 మంది కరోనా బారిన పడి మృతి చెందారు.

గడిచిన 24 గంటల్లో 47,746 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 15,83,489 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారంవిడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో పేర్కొంది. కాగా, దేశంలో ప్రస్తుతం రికవరీ రేటు69.80 శాతం ఉండగా.. మరణాల రేటు 1.99 శాతంగా ఉంది. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో అత్యధిక పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి..

కాగా గత వారం నుంచి నమోదు అయితున్న కేసులతో పోలిస్తే తాజాగా తక్కుఅవగానే నమోదు అయ్యాయి ...అరవై వేలకు తక్కువ కాకుండా గత అయిదు రోజులుగా ఇండియా లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయితున్నాయి ..తాజాగా కేసులు తగ్గడం కొంత ఊరట కలిగించే విషయం అని చెప్పవచ్చు

Tags :
|
|
|
|

Advertisement