Advertisement

  • దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా తీవ్రత ..వరుసగా ఆరో రోజు యాబై వేలకు పైగా కేసులు నమోదు

దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా తీవ్రత ..వరుసగా ఆరో రోజు యాబై వేలకు పైగా కేసులు నమోదు

By: Sankar Wed, 05 Aug 2020 09:27 AM

దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనా తీవ్రత ..వరుసగా ఆరో రోజు యాబై వేలకు పైగా కేసులు నమోదు



భారత్‌లో సోమవారం కొత్తగా 52,050 కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 18,55,745 కు చేరుకుంది. గత 24 గంటల్లో 803 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కోలుకున్న వారి సంఖ్య 12,30,509కి చేరుకోగా, యాక్టివ్‌ కేసుల సంఖ్య 5,86,298గా ఉంది. గత ఆరు రోజులుగా వరుసగా రోజుకు 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.

తాజా 803 మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 266 మంది మరణించారు. కర్ణాటక నుంచి 98, ఆంధ్రప్రదేశ్‌ నుంచి 63, పశ్చిమబెంగాల్‌ నుంచి 53, ఉత్తర ప్రదేశ్‌ నుంచి 48, ఢిల్లీ నుంచి 17, తెలంగాణ నుంచి 23, గుజరాత్‌ నుంచి 22 మంది మరణించారు. ఆగస్టు 2 వరకు 2,08,64,750 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది.

సోమవారం మరో 6,61,892 శాంపిళ్లను పరీక్షిస్తున్నట్లు తెలిపింది. జూలైలో ఏకంగా 1,05,32,074 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. దేశంలో కరోనా రికవరీ రేటు 66.31 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 2.10 శాతానికి పడిపోయిందని తెలిపింది.

Tags :
|
|
|

Advertisement