Advertisement

  • దేశంలో కరోనా మరణాల రేటు 1.49శాతానికి తగ్గిపోయింది

దేశంలో కరోనా మరణాల రేటు 1.49శాతానికి తగ్గిపోయింది

By: Sankar Mon, 02 Nov 2020 11:12 AM

దేశంలో కరోనా మరణాల రేటు 1.49శాతానికి తగ్గిపోయింది


భారత్‌లో కరోనా వైరస్‌ కొత్త కేసుల సంఖ్య తగ్గినా... రెండు రోజుల్లో ఓ లక్ష మార్క్‌ను క్రాస్ చేస్తూ వస్తున్నాయి... తాజా కేసులతో కలుపుకొని భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 82 లక్షల మార్క్‌ను కూడా దాటేశాయి...

కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా బులెటిన్‌ ప్రకారం... గత 24 గంటల్లో 45,230 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి... 496 మంది మృతిచెందగా... 53,285 మంది కరోనా నుంచి కోలుకున్నారు... దీంతో.. ఇప్పటి వరకు భారత్‌లో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 82,29,313కు చేరుకోగా.. 1,22,607 మంది మృతిచెందారు.. 75,44,798 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు...

దేశంలో కరోనా రికవరీ రేటు 91.68 శాతానికి పెరిగిందని.. యాక్టివ్‌ కేసులు 6.83 శాతంగా ఉన్నాయని.. కరోనా మరణాల రేటు 1.49శాతానికి తగ్గిపోయిందని కేంద్రం పేర్కొంది. మరోవైపు... భారత్‌లో ప్రస్తుతం 5,61,908 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు కరోనా బులెటిన్‌లో పేర్కొంది కేంద్రం. మరోవైపు ఆదివారం రోజు దేశవ్యాప్తంగా 8,55,800 శాంపిల్స్ టెస్ట్‌ చేశామని.. దీంతో.. ఇప్పటి వరకు నిర్వహించిన టెస్ట్‌ల సంఖ్య 11,07,43,103కు చేరిందని పేర్కొంది ఐసీఎంఆర్.

Tags :
|
|

Advertisement