Advertisement

  • ఇండియాలో భారీగా తగ్గుతున్న కరోనా పాజిటివ్ కేసులు..

ఇండియాలో భారీగా తగ్గుతున్న కరోనా పాజిటివ్ కేసులు..

By: Sankar Tue, 27 Oct 2020 12:10 PM

ఇండియాలో భారీగా తగ్గుతున్న కరోనా పాజిటివ్ కేసులు..


భారత్‌లో కరోనా కేసుల విజృంభణ నెమ్మదిగా తగ్గుతోంది. రోజు వారీ కేసులు కనీసం 50 వేలకు తగ్గకుండా నమోదు అవుతోండగా ఇప్పుడు ఆ సంఖ్య తగ్గింది...

కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ విడుదల చేసిన తాజా కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గడచిన 24 గంటల్లో కొత్తగా 36,469 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. 488 మంది మృతిచెందారు.. ఇక, గడచిన 24 గంటల్లో 27,860 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.. దీంతో.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 79,46,429 కు చేరుకోగా.. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 6,25,857 యాక్టివ్ కేసులు ఉన్నాయి..

72,01,070 మంది రికవరీ అయ్యారు.. ఇప్పటి వరకు 1,19,502 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. అయితే, భారత్‌లో కరోనా రికవరీ రేటు పెరిగింది.. రికవరీ రేటు 90 శాతానికి పెరిగినట్టు కేంద్రం చెబుతోంది. యాక్టివ్‌ కేసులు 8.71 శాతంగా ఉండగా.. కరోనా మరణాల రేటు 1.51 శాతానికి తగ్గిపోయింది.. మరోవైపు.. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా టెస్ట్ ల సంఖ్య 9,58,116 కాగా.. ఇప్పటి వరకు నిర్వహించిన మొత్తం టెస్ట్ ల సంఖ్య 10,44,20,894కు పెరిగింది.

Tags :
|
|

Advertisement