Advertisement

  • దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

By: Sankar Wed, 16 Dec 2020 11:11 AM

దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు


దేశంలో కరోనా పాజిటివ్ కేసులు నిలకడగా నమోదు అయితున్నాయి..గత కొంతకాలంగా కరోనా కేసులు ఇరవై వేల దగ్గర్లో నమోదు అయితున్నాయి...అయితే తాజాగా గత ఇరవై నాలుగు గంటల్లో కరోనా పాజిటివ్ కేసులు స్వల్పంగా పెరిగాయి...

గత 24 గంటల్లో కొత్తగా 26,382 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 99,32,548కి చేరింది. ఇందులో 3,32,002 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 94,56,449 మంది బాధితులు కోలుకున్నారు.

నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 33,813 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు. మరో 387 మంది కొత్తగా మరణించడంతో మొత్తం మరణాలు 1,44,096కు చేరాయి. దేశంలో రికవరీరేటు 95.4 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.45 శాతంగా ఉన్నది.

దేశంలోని మొత్తం యాక్టివ్‌ కేసుల్లో ఐదు రాష్ట్రాల్లో 56 శాతం ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇందులో అత్యధికంగా మహారాష్ట్రలో 21.62 శాతం ఉండగా, కేరళలో 17.01 శాతం, పశ్చిమబెంగాల్‌లో 6.29 శాతం, ఛత్తీస్‌గఢ్‌లో 5.58 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 5.57 శాతం ఉన్నాయని వెల్లడించింది

Tags :
|
|

Advertisement