Advertisement

ఇండియాలో కొత్త కరోనా కేసులు ఎన్నంటే!

By: Sankar Fri, 18 Dec 2020 11:52 AM

ఇండియాలో కొత్త కరోనా కేసులు ఎన్నంటే!


భారత కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి..దాదాపు పది నెలల కిందట తొలి కరోనా కేసు ఇండియాలో నమోదు కాగా నేడు ఆ సంఖ్య కోటికి అది దగ్గర్లో ఉంది..గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 22,889 కొత్త కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. 338 మంది మృతిచెందారు..

ఇదే సమయంలో 31,087 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో... కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కోటికి చేరువైంది.. ఇప్పటి వరకు 99,79,447 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మంది 95,20,827 కరోనా నుంచి కోలుకున్నారు.. 1,44,789 మంది మృతిచెందగా.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,13,831 యాక్టివ్ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది కేంద్ర సర్కార్.

కాగా, ఓ దశలో రోజువారి కోవిడ్ కేసుల సంఖ్య లక్షకు చేరువై.. క్రమంగా తగ్గుముఖం పట్టిన సంగతి తెలిసిందే.. అయితే, ఇప్పుడు కేసులు తగ్గినట్టే అనిపిస్తున్న ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మళ్లీ కేసులు విజృంభించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు..

Tags :
|
|

Advertisement