Advertisement

  • దేశంలో తొలిసారిగా యాబై వేలు దాటిన కరోనా కేసులు..

దేశంలో తొలిసారిగా యాబై వేలు దాటిన కరోనా కేసులు..

By: Sankar Mon, 27 July 2020 09:56 AM

దేశంలో తొలిసారిగా యాబై వేలు దాటిన కరోనా కేసులు..



దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఆదివారం రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా 50వేలకుపైగా కేసులు నిర్దారణ అయ్యాయి. దేశంలో వైరస్ మొదలైన తర్వాత ఇంత భారీ సంఖ్యలో కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. అంతేకాదు, దేశంలో మొత్తం కరోనా కేసులు 50వేలకు చేరడానికి దాదాపు మూడు నెలలు పట్టింది. ఇప్పుడు ఒక్క రోజులోనే అన్ని కేసులు నమోదుకావడం మహమ్మారి తీవ్రతకు అద్దం పడుతోంది.

ఆదివారం దేశవ్యాప్తంగా 50,362వేల మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ కాగా.. మరో 717 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా వైరస్ మొదలైన తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో కేసులు నమోదుకావడం చోటుచేసుకోవడం ఇదే తొలిసారి. ప్రస్తుతం దేశంలో మొత్తం కరోనా కేసులు సంఖ్య 14,34,851కి చేరగా.. మరణాలు 32,812కి చేరాయి. గతవారంతో పోల్చితే దేశంలో పాజిటివ్ కేసులు 28 శాతం, మరణాలు 19 శాతం పెరిగాయి.

ఇప్పటి వరకూ అమెరికా, బ్రెజిల్‌లో మాత్రమే 24 గంటల్లో 50వేలు కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం భారత్ ఈ దేశాల సరసన చేరింది. గత ఆదివారం ఒక్క రోజులోనే తొలిసారి 40వేల కేసులు నమోదయ్యాయి.వారం వ్యవధిలోనే ఒక్క రోజు కేసుల సంఖ్య యాబై వేలకు చేరుకున్నాయి..

Tags :
|
|
|

Advertisement