Advertisement

  • దేశంలో రికార్డు స్థాయిలో కరోనా టెస్టులు... తాజాగా మరో 78,761 కేసులు

దేశంలో రికార్డు స్థాయిలో కరోనా టెస్టులు... తాజాగా మరో 78,761 కేసులు

By: Sankar Mon, 31 Aug 2020 07:41 AM

దేశంలో రికార్డు స్థాయిలో కరోనా టెస్టులు... తాజాగా మరో 78,761 కేసులు


దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ మాత్రం ఆగడం లేదు. ఆదివారం తాజాగా మరో 78,761 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 35,42,733కు చేరుకుంది. గత 24 గంటల్లో 64,935 మంది కోలుకోగా 948 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 63,498కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది..

దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 27,13,933 కాగా, యాక్టివ్‌ కేసుల సంఖ్య 7,65,302గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసుల శాతం 21.60గా ఉంది. యాక్టివ్‌ కేసుల కంటే 19.5 లక్షల కోలుకున్న కేసులు ఉండటం గమనార్హం. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోంది. ఆదివారానికి ఇది 76.61 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు క్రమంగా తగ్గుతోందని ప్రస్తుతం 1.79 శాతానికి పడిపోయిందని తెలిపింది.

ఆగస్టు 29 వరకు 4,14,61,636 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది. శనివారం మరో 10,55,027 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది. గతం వారం రోజుల్లోనే అయిదు లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజా 948 మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 328 మంది మరణించారు. మొత్తం మరణాల్లో కూడా మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. తర్వాతి స్థానాల్లో తమిళనాడు, కర్ణాటక ఉన్నాయి.

Tags :
|
|
|

Advertisement