Advertisement

ఒక్క రోజు కరోనా కేసుల్లో మూడో స్థానంలో భారత్

By: Sankar Mon, 22 June 2020 11:41 AM

ఒక్క రోజు కరోనా కేసుల్లో మూడో స్థానంలో భారత్



కరోనా మహమ్మారి ఉదృతి ఇప్పట్లో ఆగేలా లేదు ..చైనాలో మొదలైన ఈ ప్రభావం అంతకంతకు పెరుగుతూ ప్రపంచ దేశాలంటిని చుట్టుముట్టింది ..గత నాలుగు నెలలుగా అన్ని దేశాలు కరోనా గురించే తప్ప వేరే వాటి గురించి ఆలోచించే పరిస్థితి లేకుండా అయింది..అయితే కరోనా టెస్టులు పెరగడంతో అన్ని దేశాలలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది..ఈ క్రమంలో నిన్న ఒక్కరోజే రికార్డు స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా 1,83,000కు పైగా కొత్త కేసులు వెలుగు చూసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది ..

వీటిలో 54,771 కేసులతో బ్రెజిల్‌ ప్రథమ స్థానంలో ఉండగా.. 36,617 కేసులతో అమెరికా రెండో స్థానంలో, 15,400 కేసులతో భారత్‌ మూడో స్థానంలో ఉన్నది. టెస్టుల సంఖ్య పెరగడం, అధిక సంఖ్యలో వైరస్‌ వ్యాప్తి చెందడం వల్ల ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. గత 24 గంటల్లో నమోదయిన కేసులతో కలుపుకుని ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కరోనా కేసుల సంఖ్య 87,08,008కు చేరగా.. నిన్న సంభవించిన 4,743 మరణాలతో కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా మరణాల సంఖ్య 4,61,715కు చేరింది. నిన్నటి మరణాల్లో రెండింట మూడొంతుల మరణాలు అమెరికాలోనే సంభవించడం గమనార్హం.

ఆదివారం ఒక్క రోజే మొత్తం కేసుల సంఖ్య 50,000కు పైగా పెరిగిందని బ్రెజిల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అధ్యక్షుడు జైర్ బోల్సోనారో తమ దేశంలో దాదాపు 50,000 మరణాలు సంభవించాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న కరోనా మరణాల్లో బ్రెజిల్‌ రెండవ స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికాలో శనివారం ఒకే రోజు అత్యధికంగా 5,000 కొత్త కేసులు నమోదయ్యాయి.. 46 మంది మరణించారు. కేసుల సంఖ్యలో పెరుగుదల ఉన్నప్పటికీ ఆ దేశ అధ్యక్షుడు సిరిల్ రామాఫోసా కఠినమైన లాక్‌డౌన్‌ను సడలిస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో క్యాసినోలు, బ్యూటీ సెలూన్లు, రెస్టారెంట్ సేవలు పునరుద్దరించారు. జర్మనీలోని ఒక మాంసం ప్యాకింగ్ ప్లాంట్‌లో 1,000కి పైగా కేసులు వెలుగు చూడటంతో అక్కడి ప్రభుత్వం మొత్తం 6,500 మంది కార్మికులు, నిర్వాహకులతో పాటు వారి కుటుంబ సభ్యులను క్వారంటైన్‌లో ఉంచింది.


Tags :
|
|
|
|

Advertisement