Advertisement

  • వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ కొత్త నియ‌మావ‌ళి వల్ల ఐసీసీ టెస్ట్ ర్యాంకులో ఇండియా రెండ‌వ స్థానానికి

వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ కొత్త నియ‌మావ‌ళి వల్ల ఐసీసీ టెస్ట్ ర్యాంకులో ఇండియా రెండ‌వ స్థానానికి

By: chandrasekar Fri, 20 Nov 2020 7:45 PM

వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ కొత్త నియ‌మావ‌ళి వల్ల ఐసీసీ టెస్ట్ ర్యాంకులో  ఇండియా రెండ‌వ స్థానానికి


వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ కొత్త నియ‌మావ‌ళి వల్ల ఐసీసీ టెస్ట్ ర్యాంకులో ఇండియా రెండ‌వ స్థానానికి పడిపోయింది. అంత‌ర్జాతీయ క్రికెట్ మండ‌లి నిర్వ‌హిస్తున్న టెస్ట్ చాంపియ‌న్‌షిప్‌కు సంబంధించిన రూల్స్‌ను మార్చేశారు. అయితే వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్ కోసం కొత్త నియ‌మావ‌ళిని తీసుకువ‌స్తున్నారు. ఆడిన టెస్ట్ మ్యాచ్‌ల ఆధారంగా వ‌చ్చిన పాయింట్ల‌తో ఆయా జ‌ట్ల‌కు ర్యాంకులు ఇవ్వ‌నున్న‌ట్లు ఐసీసీ వెల్ల‌డించింది. కోవిడ్ మ‌హ‌మ్మారి వ‌ల్ల టెస్ట్ చాంపియ‌న్‌షిప్ రూల్స్‌లో మార్పు తీసుకురావాల్సి వ‌చ్చింద‌ని ఐసీసీ చెప్పింది.

ప్రతుత ఈ కొత్త నియ‌మావ‌ళి వల్ల భార‌త్ రెండ‌వ స్థానానికి ప‌డిపోయింది. ఆస్ట్రేలియా 82.22 శాతం పాయింట్ల‌తో మొద‌టిస్థానంలో నిలిచింది. ఇండియా(75) రెండ‌వ స్థానంలో, ఇంగ్లండ్‌(60.83) మూడ‌వ స్థానంలో ఉన్నాయి. ఆ త‌ర్వాత న్యూజిలాండ్ 50 పాయింట్ల‌తో నాలుగ‌వ స్థానంలో ఉన్న‌ది. మ్యాచ్‌లు పూర్తి అయిన వాటి ఆధారంగా వ‌చ్చిన పాయింట్ల‌తో ర్యాంకింగ్స్ ఇవ్వ‌నున్న‌ట్లు ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మ‌నూ సాహ‌నే తెలిపారు. కొన్ని జ‌ట్ల కోసం మ్యాచ్‌ల కోటాను పెంచేందుకు ఐసీసీ సంసిద్ధ‌త వ్య‌క్తం చేసింది.

వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్‌ను వ‌చ్చే ఏడాది జూన్‌లో ఎట్టి ప‌రిస్థితుల్లో నిర్వ‌హించ‌నున్న‌ట్లు సాహ‌నే తెలిపారు. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌, ఇంగ్లండ్‌, ఇండియా, న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌, సౌతాఫ్రికా, శ్రీలంక‌, వెస్టిండీస్ జ‌ట్ల మ‌ధ్య టెస్ట్ చాంపియ‌న్‌షిప్ నిర్వ‌హిస్తున్నారు. గ‌త ఏడాది ఈ టోర్నీ ప్రారంభించారు. 27 సిరీస్‌ల‌తో మొత్తం 71 మ్యాచ్‌లు నిర్వ‌హించాల‌ని భావించారు. రెండేళ్ల‌లో చాంపియ‌న్‌షిప్‌ను పూర్తి చేయ‌నున్నారు. అయితే క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల ఆరు టెస్ట్ సిరీస్‌ల‌ను ర‌ద్దు చేశారు. దాంట్లో బంగ్లా మ్యాచ్‌లే నాలుగు ఉన్నాయి. మ‌హిళ‌ల టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను 2023కు వాయిదా వేసిన‌ట్లు సాహ‌నే తెలిపారు. కరోనా వల్ల ఈ మార్పులు చేసినట్లు తెలిసింది.

Tags :
|

Advertisement