Advertisement

  • ప్రకృతి వైపరిత్యాలతో ప్రభావితమైన సుడాన్‌కు ఆహార సాయం అందిస్తోన్నభారత్‌

ప్రకృతి వైపరిత్యాలతో ప్రభావితమైన సుడాన్‌కు ఆహార సాయం అందిస్తోన్నభారత్‌

By: chandrasekar Tue, 27 Oct 2020 03:29 AM

ప్రకృతి వైపరిత్యాలతో ప్రభావితమైన సుడాన్‌కు ఆహార సాయం అందిస్తోన్నభారత్‌


కరోనాతోపాటు ప్రకృతి వైపరిత్యాలు, అంతర్యుద్ధంతో ప్రభావితమైన సుడాన్‌కు ఆహార సాయం కోసం భారత్‌ చొరవ చూపిస్తోంది.

270 మెట్రిక్‌ టన్నుల ఆహారాన్ని సుడాన్, దక్షిణ సూడాన్, జిబౌటి, ఎరిట్రియాకు పంపినట్లు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం తెలియ జేసింది.

155 మెట్రిక్ టన్నుల గోధుమ పిండి, 65 మెట్రిక్ టన్నుల బియ్యం, 50 మెట్రిక్ టన్నుల చెక్కరను భారతీయ నావికాదళానికి చెందిన అరావాత్‌ నౌకలో రవాణా చేస్తున్నట్లు పేర్కొంది.

ఈ నెల 24న ముంబై నుంచి బయలుదేరిన ఈ నౌక జిబౌటి, మసావా, పోర్ట్ సుడాన్, మొంబాసా వద్ద భారత ఆహార సహాయ సామగ్రిని దిగుమతి చేస్తుందని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

Tags :
|

Advertisement