Advertisement

  • నేపాలీ బాలిక కోసం అంతర్జాతీయ సస్పెన్షన్‌ బ్రిడ్జిని తెరిచిన భారత్‌

నేపాలీ బాలిక కోసం అంతర్జాతీయ సస్పెన్షన్‌ బ్రిడ్జిని తెరిచిన భారత్‌

By: chandrasekar Wed, 30 Sept 2020 7:06 PM

నేపాలీ బాలిక కోసం అంతర్జాతీయ సస్పెన్షన్‌ బ్రిడ్జిని తెరిచిన భారత్‌


ఉత్తరాఖండ్‌ పితోరాగఢ్‌ జిల్లాలోని అంతర్జాతీయ సస్పెన్షన్‌ వంతెనని భారత్‌ సోమవారం అర్ధరాత్రి అరగంట పాటు ఓపెన్‌ చేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ నేపాలీ బాలికకి తక్షణ వైద్య సాయం అందించేందుకు అంతర్జాతీయ మార్గాన్ని ఓపెన్‌ చేసింది.

పొత్తికడుపులో గడ్డలతో బాధపడుతున్న నేపాలీ బాలిక పితోరాగఢ్‌ హాస్పిటల్ లో చేర్పించారు. హాస్పిటల్‌కు వెళ్లేందుకు వంతెన ఒక్కటే మార్గం కావడంతో నేపాలీ ప్రభుత్వం అనారోగ్యంతో ఉన్న బాలిక ప్రయాణానికి ఏర్పాట్లు చేయాలని భారత్‌ను కోరింది.

నేపాలీ ప్రభుత్వ అభ్యర్థన మేరకు ధార్చులా డిప్యూటీ కలెక్టర్ అర గంట పాటు అనుమతి యిచ్చినట్లు ధ్రువీకరించారు. ఆ అమ్మాయితో పాటు ఇరువైపుల నుంచి వచ్చిన జనం వంతెన దాటారు. చికిత్స కోసం సరిహద్దు వెంబడి తమ ప్రయాణానికి ఏర్పాట్లు చేయాలని నేపాల్ అధికారులను కోరినట్లు బాలిక తల్లి రేవతిదేవి చెప్పారు.

Tags :
|

Advertisement